రంగస్థలం రికార్డులు అవుట్... మహేష్ టైం షురూ

First Published 21, Apr 2018, 12:51 PM IST
Mahesh Beats rangasthalam records in tamilnadu
Highlights

ఆల్ టైం రికార్డులు సృష్టిస్తున్న మహేష్

కొరటాల శివ .. మహేశ్ బాబు కాంబినేషన్లో రూపొందిన 'భరత్ అనే నేను' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, తొలి ఆటతోనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లోను .. ఓవర్సీస్ లోనే కాదు, చెన్నైలోను ఈ సినిమా తొలిరోజున భారీ వసూళ్లను రాబట్టింది. 

ఈ మధ్య మన సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు అదరగొట్టేస్తున్నాయి. చరణ్ కథానాయకుడిగా చేసిన 'రంగస్థలం' తొలి రోజున చెన్నైలో 25 లక్షల గ్రాస్ ను వసూలు చేసి మొదటిస్థానంలో నిలిచింది. నిన్న విడుదలైన 'భరత్ అనే నేను' ఆ రికార్డును బ్రేక్ చేస్తూ తొలిరోజున చెన్నైలో 27 లక్షలకి పైగా గ్రాస్ ను వసూలు చేసి కొత్త రికార్డును సృష్టించింది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా, మరిన్ని రికార్డులను సాధించే అవకాశం ఉంది. రెండు పరాజయాల తరువాత మహేశ్ ఆశిస్తోన్న బ్లాక్ బస్టర్ పడటం ఆయన అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.       

loader