సూపర్ స్టార్ మహేశ్ బాబు కొడుకు గౌతమ్ ఘట్టమనేని (Gautam Ghattamaneni) రంగస్థలంపై ఓ నాటకాన్ని ప్రదర్శించారు. తొలిసారిగా అద్భుతమైన పెర్పామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. 

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), నమ్రతా శిరోద్కర్ ఏకైక పుత్రుడు గౌతమ్ ఘట్టమనేని తనలోని ఒక్కో నైపుణ్యాన్ని బయటపెడుతున్నారు. ఇప్పటికే స్కూల్ ఎడ్యేకేషన్ కంప్లీట్ చేసుకున్న గౌతమ్ ప్రస్తుతం ఇంటర్మీడియేట్ చదువుతున్నారు. స్టార్ కిడ్ గా గౌతమ్ తెలుగు ఆడియెన్స్ కు ఎంతగానో సుపరిచితుడు. 16 ఏండ్ల వయస్సులోనే గౌతమ్ తండ్రిని మించిన ఎత్తు, హ్యాండసమ్ లుక్ తో ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో గౌతమ్ లోని ఒక్కో స్కిల్ ను బయటపెడుతూ వస్తున్నాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తాజాగా రంగస్థలంపై అదిరిపోయే పెర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. ఫస్ట్ టైం థియేటర్ ప్లేలో నటించినప్పటికీ అందరిని ఆకట్టుకున్నాడు. స్కూల్ ఎక్సలెన్స్ లో భాగంగా నిర్వహించిన ఈ థియేటర్ ప్లేలో గౌతమ్ తనదైన పెర్పామెన్స్ తో దుమ్ములేపాడు. ప్రముఖ హాలీవుడ్ చిత్రం ఫ్రోజెన్‌ పై రూపొందించిన ఈ నాటకంలో అచ్చు తండ్రిలాగే నటించడం పట్ల అందరూ ఫిదా అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా నమ్రతా నెట్టింట పోస్ట్ చేయడంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు సినీ ప్రియులు గౌతమ్ ను ప్రశంసిస్తున్నారు. 

నమ్రతా ఈ వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ గౌతమ్ పై ప్రేమను కురిపించింది. ‘గౌతమ్ ప్రేమకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. GG హైస్కూల్‌లో మొదటిసారి నిర్వహించిన థియేటర్ ప్రొడక్షన్ లో తనదైన శైలిలో నటించాడు. గెటప్ కూడా కొత్తగా, వింతగా ఉంది.’ అంటూ మురిసిపోతోంది. ఇక గౌతమ్ అచ్చు మహేశ్ బాబులాగే కనిపిస్తున్నారంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే గౌతమ్ మహేశ్ బాబు నటించిన ‘1 నేనొక్కడినే’తో చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే. 

View post on Instagram