`ఈ శాశ్వత ప్రేమ, రక్ష, బాధ్యతను సెలబ్రేట్ చేసుకోండి. హ్యాపీ రక్షాబంధన్, ఇంట్లోనే ఉండండి` అంటూ కామెంట్ చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.
రక్షాబంధన్ సందర్భంగా సూపర్‌స్టార్ మహేష్ బాబు తన అభిమానులకు శుభాకాంక్షలు తెలిపాడు. ఇంట్లో కొడుకు గౌతమ్, కూతురు సితారలు ఆప్యాయంగా ఉన్న ఫోటోను ట్వీట్ చేసిన మహేష్.. `ఈ శాశ్వత ప్రేమ, రక్ష, బాధ్యతను సెలబ్రేట్ చేసుకోండి. హ్యాపీ రక్షాబంధన్, ఇంట్లోనే ఉండండి` అంటూ కామెంట్ చేశాడు.
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నాడు మహేష్. సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకొని సర్కార్ వారి పాట సినిమాను ప్రకటించిన మహేష్, ఆ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభించలేదు. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన తరువాతే షూటింగ్ ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నాడు మహేష్. అయితే ఈ సమయంలో తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు.
గతంలో సోషల్ మీడియా అడపాదడపా మాత్రమే ట్వీట్లు చేసే మహేష్ లాక్ డౌన్ సమయంలో చాలా యాక్టివ్ అయ్యాడు. తాను పిల్లలతో ఎంజాయ్ చేసే మూమెంట్స్ నుంచి తాను చదువుతున్న పుస్తకాలు, చూస్తున్న సినిమాల వివరాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు మహేష్.
