Asianet News TeluguAsianet News Telugu

మేకప్ మాన్ కి మహేష్ లవ్ అండ్ రెస్పెక్ట్.. అందుకే ఆయన స్పెషల్

ఓ స్టార్ హీరో ప్రముఖులకు బర్త్ డే విషెష్ తెలియజేయడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే మహేష్ తన మేకప్ మాన్ బర్త్ డే గుర్తు పెట్టుకొని మరి విషెష్ తెలియజేయడం అతని గొప్ప మనసుకు నిదర్శనం. 
 

mahesh babu wishes a very happy birth day to his personal make up man ksr
Author
Hyderabad, First Published Jul 9, 2021, 8:30 AM IST

టాలీవుడ్ టాప్ స్టార్స్ లో మహేష్ శైలి చాలా భిన్నంగా ఉంటుంది. మహేష్  తక్కువగా మాట్లాడతారు. పబ్లిక్ వేడుకలకు హాజరుకావడం కూడా అరుదు. గతంతో పోల్చితే ఆయన కొంచెం ఫ్యాన్స్ తో కలిసే ప్రయత్నం చేస్తున్నారు. వేడుకలు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ వారికి మరింత చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో మహేష్ సూపర్ యాక్టీవ్, ఆ విషయంలో ఎవరైనా ఆయన తరువాతే. 


ప్రతి చిన్న విషయం గురించి ట్వీట్ రూపంలో తన భావాలు తెలియజేస్తాడు మహేష్ బాబు. పరిశ్రమలో ఇతర హీరోల బర్త్ డేస్ రోజున ఖచ్చితంగా బెస్ట్ విషెష్ తెలియజేస్తారు. ఓ స్టార్ హీరో ప్రముఖులకు బర్త్ డే విషెష్ తెలియజేయడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే మహేష్ తన మేకప్ మాన్ బర్త్ డే గుర్తు పెట్టుకొని మరి విషెష్ తెలియజేయడం అతని గొప్ప మనసుకు నిదర్శనం. 


సీనియర్ మేకప్ మాన్ పట్టాభి చాలా కాలంగా మహేష్ వ్యక్తిగత మేకప్ మాన్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న పట్టాభి బర్త్ డే కావడంతో మహేష్... నాకు తెలిసిన ఉత్తమ మేకప్ మాన్ కి బర్త్ డే విషెష్, మీ భవిష్యత్ బాగుండాలని కోరుకుంటూ.. ప్రేమ, గౌరవంతో మీ మహేష్... అంటూ ట్వీట్ చేశారు. మహేష్ తన మేకప్ మాన్ కి బర్త్ డే విషెష్ చెప్పడం పట్ల సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం అవుతుంది. 


మరోవైపు మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios