Mahesh Babu: రెండు రోజుల్లో రెండు సినిమాలు చూడనున్న మహేష్
ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా మే 12 న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ లో మహేష్ బాబు బిజిగా ఉన్నారు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత రెండు రోజులు ఆయన రెండు సినిమాలు చూడనున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు రేపీ టైమ్ కు థియోటర్స్ లాండ్ అయ్యిపోతాడు. "సర్కారు వారి పాట" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తారు. "గీత గోవిందం" డైరెక్టర్ పరశురామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. "మహానటి" బ్యూటీ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా మే 12 న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ లో మహేష్ బాబు బిజిగా ఉన్నారు.
ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత రెండు రోజులు ఆయన రెండు సినిమాలు చూడనున్నారు. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు మహేష్ బాబు...శనివారం నాడు తన సొంత సినిమా సర్కారు వారి పాట సినిమా చూస్తారు. అలాగే ఆ తర్వాత రోజు ఆదివారం తను నిర్మించిన మేజర్ చిత్రం చూడబోతున్నారు. ఈ రెండు సినిమాలపై మహేష్ బాబు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ప్రమోషన్స్ లో యాక్టివ్ గా ఉన్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ వారు సంయుక్తంగా "సర్కారు వారి పాట" సినిమాను నిర్మించారు. ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ తో బయటకు వచ్చింది. అంతేకాదు, రన్ టైమ్ కూడా లాక్ అయినట్టు తెలుస్తోంది. 2 గంటల 42నిమిషాల నిడివితో సర్కారు వారి పాట సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని సమాచారం. సినిమాకి సంబంధించి పెద్దగా కట్స్ లేనట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిన్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన " మ మ మహేషా" పాట కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ బుకింగ్స్ మొదలైపోయాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది.