సూపర్ స్టార్ మహేష్ బాబు 'భరత్ అనే నేను' సినిమా తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. జూన్ నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా ఎక్కువ భాగం చిత్రీకరణ అమెరికాలో జరగనుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్ తో కనిపించబోతున్నాడని అంటున్నారు. దీనికి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మహేష్ బాబు గడ్డం, మీసంతో సీరియస్ గా చూస్తోన్న ఒక పోస్టర్ ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది.

'రాజసం' అనే టైటిల్ కూడా పెట్టేశారు. ఈ పోస్టర్ లో మహేష్ లుక్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఈ టైటిల్ ప్రచారంలో ఎంతవరకు నిజముందనే విషయాన్ని చిత్రబృందం వెల్లడించాల్సివుంది!