మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో 'అతడు', 'ఖలేజా' వంటి సినిమాలు వచ్చాయి. 'అతడు' సక్సెస్ అయినప్పటికీ 'ఖలేజా' మాత్రం నిరాశపరిచింది. కానీ మహేష్ లో కామెడీ యాంగిల్ అతడి ఫ్యాన్స్ కి బాగా నచ్చింది.

ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి పని చేయబోతున్నారు. అయితే అది సినిమా కోసం కాదు.. మహేష్ బాబుని పెట్టి ఓ యాడ్ ఫిల్మ్ ని షూట్ చేయబోతున్నాడు త్రివిక్రమ్. త్రివిక్రమ్ గతంలో చాలా మంది స్టార్స్ నటించిన కమర్షియల్ యాడ్స్ ని డైరెక్ట్ చేశాడు.

మహేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లతో యాడ్ ఫిలిమ్స్ షూట్ చేశాడు. ఇప్పుడు మహేష్ కోసం ఓ యాడ్ చేయబోతున్నాడు. ఇదొక యాప్ కి సంబంధించిన యాడ్ గా తెలుస్తోంది. ఈ నెల 10న షూటింగ్ నిర్వహించనున్నారు.

త్రివిక్రమ్ ఓ పక్క అల్లు అర్జున్ ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నప్పటికీ ఇది మంచి డీల్ కావడంతో రెండు రోజులు గ్యాప్ ఇచ్చి యాడ్ ఫిల్మ్ షూట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.