సూపర్ స్టార్ మహేష్ బాబు.. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నట్లుగా టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా డైలాగ్ వెర్షన్ సిద్ధం చేస్తున్నారు. మరోపక్క హీరోయిన్ ని ఫైనల్ చేసే పనిలో పడ్డారు. మొదట సాయి పల్లవి, రష్మిక లాంటి హీరోయిన్లను అనుకున్నప్పటికీ మహేష్ పక్కన వారు సెట్ అవ్వరనే సందేహాలు వ్యక్తం కావడంతో ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్లపై దృష్టి పెట్టారు.

ఈ క్రమంలో సోనాక్షి సిన్హా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. గతంలో కూడా సోనాక్షిని టాలీవుడ్ కి తీసుకురావాలని ప్రయత్నించారు కానీ వర్కవుట్ కాలేదు. ఈ మధ్యకాలంలో ఆమె బరువు తగ్గి బాగా సన్నబడింది. ఈ క్రమంలో మహేష్ సరసన  ఆమె సూట్ అవుతోందని భావిస్తున్నారు.

మరి సోనాక్షి ఒప్పుకుంటుందో లేదో చూడాలి. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో కీలక పాత్ర కోసం సీనియర్ నటి విజయశాంతిని రంగంలోకి దింపుతున్నట్లు టాక్. దిల్రాజు, అనీల్ సుంకర సంయుక్తంగా సినిమాను నిర్మించే అవకాశాలు ఉన్నాయి.