మహేష్ పద్దతి మార్చుకుని త్రివిక్రమ్ తో...
దాదాపు 11ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా ఖరారవటంతో అంతటా ఆసక్తి నెలకొంది. దీంతో మహేశ్ అభిమానులు తెగ సంబరపడుతున్నారు. ఈ నేపధ్యంలో ఓ చిత్రమైన విషయం బయిటకు వచ్చింది. ఈ సినిమా గురించి మహేష్ తన రెగ్యలర్ పద్దతిని మార్చుకుంటున్నారట.
మొత్తానికి అందరూ ఎక్సపెక్ట్ చేసినట్లుగానే సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పారు. తన నెక్ట్ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్నానని అఫీషియల్ గా ప్రకటించారు. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు వచ్చాయి. దాదాపు 11ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా ఖరారవటంతో అంతటా ఆసక్తి నెలకొంది. దీంతో మహేశ్ అభిమానులు తెగ సంబరపడుతున్నారు. ఈ నేపధ్యంలో ఓ చిత్రమైన విషయం బయిటకు వచ్చింది. ఈ సినిమా గురించి మహేష్ తన రెగ్యలర్ పద్దతిని మార్చుకుంటున్నారట.
మహేష్ మాములుగా తను ప్రస్తుతం ఏదైతే సినిమా చేస్తున్నాడో అది రిలీజ్ అయ్యేదాకా మరో సినిమా షూటింక్ కు వెళ్లరు. కానీ ఈ సారి పూర్తిగా ఆ పద్దతికి స్వస్ది చెప్తున్నారట. కరోనా తో టైమ్ చాలా వేస్ట్ అయ్యిందని భావించి..సర్కారు వారి పాట పూర్తవకుండానే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాను అని చెప్పారట. ఆ గ్యాప్ లో ఈ సినిమా చేద్దామన్నారట. దాంతో త్రివిక్రమ్ కు కూడా టైమ్ కలిసి వస్తుంది ఖచ్చితంగా.
ఇక ‘సరిలేరు నీకెవ్వరూ’తో మహేశ్‌బాబు, ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఇచ్చిన సక్సెస్ తో త్రివిక్రమ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై చినబాబు నిర్మిస్తున్నారు. వచ్చే వేసవికి ఈ సినిమా విడుదల కానుంది. హీరోయిన్, నటీనటుల గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
మహేశ్‌బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారిపాట’లో బిజీగా ఉన్నారు. కరోనా వల్ల ఆ షూటింగ్ వాయిదా పడింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందకు తీసుకురానున్నట్లు ఇప్పటికే చిత్ర టీమ్ ప్రకటించింది. మరోవైపు త్రివిక్రమ్ పవన్‌కల్యాణ్, రానా కలయికలో మల్టీస్టారర్‌గా వస్తున్న చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఎన్టీఆర్‌తోనూ ఒక సినిమా చేసే అవకాసం ఉన్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.