సూపర్ స్టార్ మహేష్ హీరోగా తెరకెక్కిన స్పైడర్ మరుగదాస్ దర్శకత్వంలో 120 కోట్ల భారీ బజట్ తో తెరకెక్కిన స్పైడర్ బాక్సాఫీస్ ముందు రెండు రోజుల్లోనే 72 కోట్లు సాధించిందంటున్న ట్రేడ్ వర్గాలు

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ స్పైడర్. దసరా కానుకగా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతోంది. స్పైడర్ సినిమా థియేటర్లు 95 శాతం ఆక్యుపెన్సీతో హౌజ్‌ఫుల్ అవడంతో రిలీజైన తొలిరోజే ఈ సినిమా సుమారు రూ.51 కోట్ల కలెక్షన్స్ సాధించింది. రెండవ రోజున ఈ సినిమా రూ.21 కోట్ల కలెక్షన్స్ సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేటప్పటికి స్పైడర్ మూవీ రూ.100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.



డిస్ట్రిబ్యూషన్ హక్కులతోపాటు ఇతర హక్కుల రూపంలో రిలీజ్ కి ముందే స్పైడర్ సినిమా రూ. 150 కోట్ల వ్యాపారం చేసినట్టు బాక్సాఫీస్ వర్గాల సమాచారం. ఇక ఓవర్సీస్ విషయానికొస్తే, కేవలం ప్రీమియర్స్, ఓపెనింగ్స్ కలిపి రూ.7.45 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేటప్పటికీ ఓవర్సీస్ లోనూ 2.8 మిలియన్ డాలర్స్ రాబడుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.ఇక మహేష్ ను మరింతగా తన స్థాయికి తగ్గట్టు చూపించి వుంటే ప్రజలు మరింతగా ఆదరించి వుండేవారనే టాక్ వినిపిస్తోంది.