ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత బాక్సర్ మేరీకోమ్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ నేపధ్యంలో  మేరీకోమ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్న  విషయం తెలిసిందే. ఆరోసారి స్వర్ణ పతకాన్ని సాధించి... ఆ ఘనతను సాధించిన తొలి మహిళా బాక్సర్‌గా చరిత్రకెక్కిన ఆమెను అన్ని రంగాలు వారు..   అభినందనలతో ముంచెత్తున్నారు. 

ఈ నేఫద్యంలో  ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో మేరీకోమ్ విజయం సాధించడం గర్వంగా ఉందని మహేష్ ట్వీట్ చేశాడు. 'అద్భుతమైన విజయం. ఛాంపియన్... నీ విజయాన్ని చూసి గర్విస్తున్నాము. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో ఆరు స్వర్ణాలను గెలుపొందినందుకు అభినందనలు.'

35 ఏళ్ల మేరీకోమ్ రాజ్యసభ సభ్యురాలిగా కూడా ఉన్నారు. ఆమెను భారత రాష్ట్రపతి నామినేట్ చేశారు. ఆమెకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఢిల్లీలోని కేడీ జాదవ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో... ఉక్రెయిన్ బాక్సర్ హన్నా ఒకోటాపై మేరీకోమ్ ఘన విజయం సాధించింది. 48 కిలోల విభాగంలో 5-0తో ఒకోటాను ఖంగుతినిపించింది. 

ఈ టోర్నీ ముందు వరకు ఐదు స్వర్ణ పతకాలతో ఐర్లండ్ బాక్సింగ్ దిగ్గజం టేలర్ తో సమానంగా మేరీకోమ్ ఉంది. ఈనాటి స్వర్ణంతో ఆరు స్వర్ణాలు సాధించిన తొలి మహిళగా చరిత్రకెక్కింది. ఆమె ఖాతాలో ఒక సిల్వర్ మెడల్ కూడా ఉండటం గమనార్హం. దీన్ని కూడా కలుపుకుంటే... ప్రపంచ ఛాంపియన్ షిప్ లో ఆమె సాధించిన పతకాల సంఖ్య ఏడు కు చేరుతుంది.