మహేష్ ఎప్పుడూ కూల్ గా సరదాగా ఉంటారు. ఎంత సమస్య వచ్చినా సాల్వ్ చేయటానికే చూస్తారు. కానీ విసుక్కోరు అని సినీ పరిశ్రమలో ఆయనతో పనిచేసిన వారు చెప్తూంటారు. అలాంటి మహేష్ కు మండిపడే మ్యాటర్ ఏముంటుంది. అదీ తన సొంత పీఆర్ టీమ్ మీద. అంటే ఉందిట..మీడియాలో ప్రచారం జరుగుతున్న దాన్ని బట్టి మహేష్ బాబుకు తన పీఆర్ టీమ్ కోపం తెప్పించిందట. ఎందుకూ అంటే టైటిల్ లీకైనందుకు అని తెలుస్తోంది. ఓ సర్పైజ్ గా ఫ్యాన్స్ కు టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేద్దామని మహేష్ ఆలోచనట. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారట. అయితే ఈ లోగా సర్కారు వారి పాట అనే టైటిల్ స్ర్పెడ్ అయ్యిపోయింది. అయితే అందుకు పీఆర్ టీమ్ కారణం కాకపోవచ్చు అని, ఈ టైటిల్ గురించి తెలిసిన వేరే ఎవరైనా కావచ్చు అని అంటున్నారు. ఎందుకంటే పీఆర్ టీమ్ ..ప్రతీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ముఖ్యంగా పబ్లిసిటీ కు సంభందించిన అన్ని జాగ్రత్తలు తీసుకునే రంగంలోకి దిగుతుంది. కాకపోతే ఒక్కోసారి కొన్ని అత్యుత్సాహంతో ఉండే కొందరి వల్ల లీకై బయిటకు వచ్చేస్తూంటాయి. 

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు, తొలి సారి పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.  విజయ్ దేవరకొండ హీరోగా ' గీతా గోవిందం' చిత్రం తీసి మంచి విజయాన్ని అందుకున్న పరుశరామ్ ఈ సారి ఓ సరికొత్త సబ్జెక్టు తో మహేష్ ని మెప్పించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురిచింన రకరకాల వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.   ఈ చిత్రానికి 'సర్కార్ వారి పాట' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు చెప్తున్నారు.  

ఇక దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వల్ల మార్చ్ నెలలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించింది. దాని వల్ల చాలా చిత్రాలు నిర్మాణ దశలోనే ఆగిపోయాయి.. కొన్ని థియేటర్లు మూసివేయటం కారణంగా రిలీజ్ లు లేవు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ ముగియ గానే ఈ కొత్త చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.  మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా చిత్రం టీమ్ ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలను రివీల్ చేయనుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకై కియారా అద్వానీ ని సంప్రదించగా ఆమె డేట్స్ సమస్యతో నో చెప్పినట్లు సమాచారం.   ఇప్పుడు సినిమా కోసం మరో హీరోయిన్‌ను కూడా వెతికే పనిలో పడింది మూవీ యూనిట్.

 “14 రీల్స్ మరియు మైత్రి మూవీ మేకర్స్” కలిసి ఈ సినిమా ని నిర్మించనున్నారు.సంగీతం  తమన్ అందించబోతున్నాడట.  అలాగే చాలా కాలం తర్వాత మహేష్ రొమాంటిక్ బాయ్ గా నటించబోతున్నాడు. మహేష్ ను ఒక మ్యాచుర్డ్ లవ్ స్టోరీలో చూపించబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమాలో ఉపేంద్ర విలన్ గా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ బయటకు రానుంది.