సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట’ . మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. సముద్ర ఖని నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో నటించారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం `సర్కారు వారి పాట`. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు. మేకర్స్ విసృతంగా ప్రమోషన్స్ నిర్వహిస్తూ సినిమాపై సూపర్ హైప్‌ను క్రియేట్ చేసారు. మే 12న ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొంది. అయినా కలెక్షన్స్ డ్రాప్ పెద్దగా లేకుండా ఇప్పుడు మూడో వారంలో అడుగుపెట్టింది. అంతేకాదు ధర్డ్ వీకెండ్ కూడా ఈ సినిమా ఓ మోస్తరు కలెక్షన్లు రాబట్టింది. ఈ నేపధ్యంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యిందా లేదా అనేది ట్రేడ్ వర్గాల్లోనూ, సామాన్య అభిమానుల్లోనూ చర్చగా మారింది. ఎందుకంటే మేకర్స్ ప్రకటించే లెక్కలకు ట్రేడ్ లో చెప్పే లెక్కలకు చాలా వ్యత్యాసం ఉంటోంది.
ఈ సినిమా 121 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. దీంతో ఈ 18 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా, బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో రూ. 12.50 కోట్లను వసూలు చేయాల్సి ఉందని అని అంటున్నారు. ఈ వారంతో ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగింపుకు వచ్చేనట్టే అని చెప్తున్నారు . ఇదే స్పీడుతో ముందుకు వెళితే బ్రేక్ ఈవెన్ రావటం సందేహమే అంటున్నారు. అయితే అఫీషియల్ గా ...ఈ చిత్ర నిర్మాతలు మాత్రం రిలీజ్ అయిన పన్నెండు రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిందని ప్రకటించారు. పోస్ట్ పాండమిక్ తర్వాత విడుదలైన చిత్రాల్లో భారీ విజయాన్ని సాధించిన చిత్రంగా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసినట్లు గా చెప్తున్నారు. దాంతో ఈ లెక్కల్లో కాస్త కన్ఫూజన్ ఏర్పడుతోంది. కాబట్టి ఏ లెక్కలు కరెక్ట్ అనే దాన్ని బట్టి ఈ బ్రేక్ ఈవెన్ అనేది అంచనా వేయాల్సి ఉంటుంది. ఓవర్సీస్ లో ఆల్రెడీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యిందని సమాచారం.
మరో ప్రక్క ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకి దక్కించుకుంది. ఇక ఒప్పందంలో భాగంగా ఈ సినిమాను అమేజాన్ ప్రైమ్ జూన్ 10న లేదా జూన్ 24న సినిమాను స్ట్రీమింగ్ తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదల కానుంది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత సెకెండ్ వీకెండ్ లో మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది.
మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీని తమన్ స్వరాలు సమకూర్చారు. ఓ బ్యాంకు నుంచి పదివేల కోట్ల రూపాయలను లోన్‌గా తీసుకున్న ఓ రాజకీయ నాయకుడు లోన్ కట్టకుండా పలుకుబడిని ఉపయోగించి తిరుగుతుంటాడు. అతని ఆహాన్ని అణిచి, లోన్ కట్టేలా హీరో ఏం చేశాడనే కథాంశంతో రూపొందిన చిత్రమే ‘సర్కారు వారి పాట’.
