సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) మరోసారి ఫ్యాన్స్ కోసం యాక్షన్ ట్రీట్ రెడీ చేస్తున్నుడు. సర్కారువారి పాట(Sarkaru Vaari Paata) లో సూపర్ స్టార్ సూపర్ స్టిల్ తో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు టీమ్.

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) మరోసారి ఫ్యాన్స్ కోసం యాక్షన్ ట్రీట్ రెడీ చేస్తున్నుడు. సర్కారువారి పాట(Sarkaru Vaari Paata) లో సూపర్ స్టార్ సూపర్ స్టిల్ తో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు టీమ్.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) హీరోగా పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమా సర్కారువారి పాట(Sarkaru Vaari Paata). మైత్రీ - 14 రీల్స్ సంస్థలతో కలిసి మహేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి స్టేజ్ లో ఉంది. త్వరలో ఈమూవీ షూటింగ్ స్టార్ట్ చేసి సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ చేయాలని చూస్తున్నారు మేకర్స్.

ఇక ఈ సినిమాతో భారీ యాక్షన్ ట్రీట్ కు రెడీ అవుతున్నాడు సూపర్ స్టార్ (Mahesh Babu). ఫ్యాన్స్ కు పుల్ మీల్స్ లాంటి సినిమాను రెడీ చేస్తున్నుడు. ఈరోజు ( మార్చ్ 1) మహాశివరాత్రి సందర్భంగా సర్కారువారి పాట సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేవారు టీమ్. పోస్టర్ చూసిన మహేష్(Mahesh Babu) ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

 ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్ సీన్స్ విషయంలో కూడా ఏ మాత్రం తగ్గకుండా ప్లాన్ చేస్తున్నాడట పరశురామ్. ఈ విషయాన్నిఆయన ముందుగానే చెప్పారు. ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్స్ సీన్స్ కూడా ఫస్ట్, సెకండ్ షెడ్యూల్స్ లోనే కంప్లీట్ చేశారు. దుబాయ్..గోవా..స్పెయిన్ లలో యాక్షన్ సీన్స్ ను షూట్ చేశారు. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యేలా ఉంటాయంటున్నారు మేకర్స్. ఇక ఈరోజు రిలీజ్ చేసిన పోస్టర్ కూడా అద్భుతంగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఇక బ్యాంక్ స్కామ్ కథ చుట్టూ తిరిగే ఈ సినిమాలో మహేష్ బాబు(Mahesh Babu) సరసన హీరోయిన్ గా కీర్తి సురేశ్(Keerthi Suresh) అలరించనుంది. రీసెంట్ గా వీరి కాంబినేషన్ లో రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ కళావతికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక మహేశ్ - వెన్నెల కిశోర్ కాంబినేషన్లోని కామెడీ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నట్టు తెలుస్తోంది. సముద్రఖని కీలకపాత్రలో నటించిన ఈసినిమాకు తమన్ సంగీతం అందించారు. ఫ్యాన్స్ కు భారీ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్న సర్కారువారి పాట సినిమాను మే 12వ తేదీన రీలీజ్ చేయనున్నారు.