Mahesh Babu: కోలుకున్న మహేష్ బాబు .. షూటింగ్ కు సై అన్న సూపర్ స్టార్..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు షూటింగ్ కు సై అంటున్నారు. రీసెంట్ గా మోకాలికి సర్జరీ చేయించుకున్న మహేష్.. దుబాయ్ లో రెస్ట్ తీసుకుంటున్నారు.

Mahesh Babu Sarkaru Vaari Paata Movie Update

ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తాడు మహేష్ బాబు(Mahesh Babu). కరోనా పుణ్యమా అని ఈ ఏడాది అసలు సూపర్ స్టార్ సినిమా రానేలేదు. ఇక పరశురామ్(Parasuram) డైరెక్షన్ లో చేస్తోన్న సక్కారువారి పాట(Sarkaru Vaari Paata) షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే రీసెంట్ గా మోకాలి సమస్యతో స్పెయిన్ లో సర్జరీ చేయిచుకున్నారు మహేష్. వెంటనే దుబాయ్ వెళ్ళారు.. అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. దాంతో సక్కారువారి పాట షూటింగ్ పెండింగ్ పడిపోయింది.

సర్కారువారి పాట రిలీజ్ డేట్ సంక్రాంతి నుంచి సమ్మర్ చేరింది. ఏప్రెల్ 2న సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు ముందే అనౌన్స్ చేశారు. అయితే ఇప్పటికే టైమ్ చాలా అయిపోయింది. షూటింగ్ కంప్లీట్ అయితే.. పోస్ట్ ప్రోడక్షన్ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకోవచ్చు. మహేష్ బాబు ఎప్పుడు కోలుకుని షూటింగ్ కు వస్తారా అని అందరూ ఎదురు చూస్తున్న టైమ్ లో గుడ్ న్యూస్ చెప్పాడట సూపర్ స్టార్. షూటింగ్ కు సై అన్నాడట.

 

సర్కారు వారిపాట షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఆ కాస్త పూర్తి చేద్దామని మహేష్ పరశురామ్ కు కబురు పెట్టినట్టు ఇండస్ట్రీ టాక్. అయితే ముందు పిబ్రవరి నుంచి షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు టీమ్. కాని మహేష్ సెట్ అవ్వడంతో జనవరిలోనే షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట సర్కారువారి పాట టీమ్. జనవరిలో స్టార్ట్ చేస్తేనే అన్ని కార్యక్రమాలు పూర్తి చుసుకుని అనుకున్ టైమ్ కు సినిమా రిలీజ్ చేయగలరు. పైగా ప్రమోషన్స్ కు కూడా టైమ్ మిగులుతుంది.

మైత్రీ మూవీస్ బ్యానర్ తో పాటు 14 రీల్స్ తో కలిసి మహేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈమూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. బ్యాక్ స్కాం కథతో తెరకెక్కుతోన్న ఈమూవీలో సముద్ర ఖని , వెన్నెలకిషోర్, సుబ్బరాజు లాంటి స్టార్స్ కాస్ట్ నటిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ చేస్తున్నారు.

Also Read : Amritha Aiyer: మెస్మరైజ్ చేస్తున్న కన్నడ సోయగం అమృతా అయ్యర్.. టాలీవుడ్ ను టార్గెట్ చేసింది.

నెక్ట్స్ మన్త్ నుంచి షూటింగ్ తో పాటు ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు సర్కారువారి పాట టీమ్. జనవరిలో మంచి అకేషన్ చూసుకుని ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. స్పెషల్ టీజర్ ను కూడా జనవరి నెలాకరికి రీలజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు సర్కారువారి పాట టీమ్. పిబ్రవరిలో ట్రైలర్ ట్రీట్ ను ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios