Asianet News TeluguAsianet News Telugu

‘సర్కారు వారి పాట’: లీక్.. సైబర్ క్రైమ్ కు కంప్లైంట్

ఈ టీజర్ దాదాపు తొమ్మిది గంటలు ముందుగానే అర్ధరాత్రి ఆన్లైన్ లో దర్శనం ఇచ్చింది. విడుదల సమయానికి కంటే ముందే అభిమానులందరికి చేరిపోవడంతో చిత్రయూనిట్ అంత కంగుతిన్నారు. 
 

Mahesh babu sarkaru vaari paata leak
Author
Hyderabad, First Published Aug 10, 2021, 10:29 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఒక్కో సినిమా కోసం సంవత్సరాలు తరబడి నిద్రాహారాలు మానేసి వందలు, వేల మంది కష్టపడుతుంటారు. ఫైనల్ గా  ఓ మంచి సమయం చూసుకుని విడుదల చేద్దాం అనుకుంటున్న తరుణంలో ఎవడో ఒకడు చేసే ఆకతాయి పని  వల్ల సినిమా లీక్ అయిపోతుంది. అలాంటిది జరిగినపుడు ఆ దర్శక నిర్మాతలు ఎంత అల్లాడిపోతారో ప్రతీ సారి ఆ టీమ్ ఆవేదన వల్ల తెలుస్తూనే ఉంది. అందరూ మీడియా ముందుకు రాకపోవచ్చు కానీ ఆవేదన అనేది మాత్రం తప్పనసరి. ఇప్పుడీ టాపిక్ ఎందుకూ అంటే..
 
 సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘సర్కారు వారి పాట’ నుంచి విడుదల చేసిన ‘బ్లాస్టర్‌’ టీజర్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అతి తక్కువ టైమ్ లోనే యూట్యూబ్ లో రికార్డ్ లు క్రియేట్ చేస్తూ అత్యధిక వ్యూస్ రాబట్టుకొంటుంది. ఇదిలావుంటే, ఈ టీజర్ దాదాపు తొమ్మిది గంటలు ముందుగానే అర్ధరాత్రి ఆన్లైన్ లో దర్శనం ఇచ్చింది. విడుదల సమయానికి కంటే ముందే అభిమానులందరికి చేరిపోవడంతో చిత్రయూనిట్ అంత కంగుతిన్నారు. 

దీంతో చేసేది ఏమిలేక ‘సర్కారు వారి పాట’ టీజర్ ను ముందుగానే విడుదల చేయాల్సివచ్చింది. అయితే దీనిపై చిత్రయూనిట్ సీరియస్ గా వుంది. ఇంటి దొంగలే పనే.. అంటూ అన్వేషణ మొదలుపెట్టింది. ఈమేరకు సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. 

ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు  సందర్భంగా ఆయనకు అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, కేటీఆర్, ఇతర ప్రముఖులు అందరూ హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అందరిలాగే కీర్తి సురేష్ కూడా ఆయనను విష్ చేసింది. “మీరు తెరపై మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లో కూడా స్ఫూర్తి! అద్భుతమైన సహనటుడు, అందమైన వ్యక్తి. పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్ సర్” అని కీర్తి ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్ కు రిప్లై ఇచ్చిన మహేష్ ధన్యవాదాలు ‘కళావతి’ అని అన్నారు. ఇంకేముంది “సర్కారు వారి పాట”లో కీర్తి సురేష్ “కళావతి” అనే పాత్రను పోషిస్తుందని మహేష్ స్వయంగా వెల్లడించినట్టు అయ్యింది.

“సర్కారు వారి పాట”కు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్, రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. దీనికి థమన్ సంగీతం అందించారు. కె. వెంకటేశ్ ఎడిటర్ కాగా, ఎఎస్ ప్రకాష్ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్.

Follow Us:
Download App:
  • android
  • ios