యూనివర్సల్‌ హీరో కమల్‌ హాసన్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ పుట్టిన రోజు ఒకే రోజు కావడం విశేషం. ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న వీరిద్దరికి సినీ సెలబ్రిటీల నుంచి బర్త్ డే విషెస్లు వెల్లువలా వస్తున్నాయి. తాజాగా మహేష్‌బాబు ఈ ఇద్దరు ప్రముఖులకు శుభాకాంక్షలు తెలిపారు. 

`లెజెండర్‌ యాక్టర్‌ కమల్‌ హాసన్‌ సర్‌కి వెరీ హ్యాపీ బర్త్ డే. తాను నటించే పాత్రలను ప్రతిబింబింపచేసే అద్భుతమైన మేథావి. మాకు మీరు స్ఫూర్తి. మీరు ఎల్లప్పుడు ఆరోగ్యంతో, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నా` అని కమల్‌ హాసన్‌కి విషెస్‌‌ చెబుతూ, ఆయనతో దిగిన ఓ అరుదైన ఫోటోని పంచుకున్నారు. 

మరోవైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కి సైతం విషెస్‌‌ చెప్పారు. `పుట్టిన రోజు శుభాకాంక్షలు త్రివిక్రమ్‌ సర్. మీరు అపరిమితమైన ఆనందంతో, విజయాలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నా` అని చెప్పారు. ఈ సందర్భంగా ఆయనతో `ఖలేజా` సినిమా టైమ్‌లో దిగిన ఫోటోని షేర్‌ చేశారు. 

కమల్‌ హాసన్‌కి సంగీతదర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ కూడా బర్త్ డే విశెష్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫోటోలను పంచుకున్నారు.