టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లో ప్రతి సినిమా నుంచి ఒక విషయాన్నీ నేర్చుకుంటాడు. ముఖ్యంగా లోపాల విషయంలో దీర్ఘంగా అలోచించి గాని ఒక నిర్ణయానికి రాడు. అయితే లుక్స్ విషయంలో మహేష్ పెద్దగా ప్రయోగాలు చేయడానికి ఇష్టపడడు. 

డ్రెస్సింగ్ అండ్ బాడీ లాంగ్వేజ్ లో కాస్త డిఫరెంట్ గా అనిపించినప్పటికీ మహేష్ ఫాలో అయ్యేది న్యాచురల్ గానే. ఆడియెన్స్ కి స్టైలిష్ గా అలాగే హ్యాండ్సమ్ గా కనిపించాలని జాగ్రత్తలు తీసుకుంటాడు. అయితే సరిలేరు నీకెవ్వరూ సినిమా కోసం దర్శకుడు అనిల్ రావిపూడి కొంచెం ఫిట్ నెస్ లో మార్పులు చేస్తే  బెటర్ అని స్క్రిప్ట్ డిస్కర్షన్ లో చెప్పాడట. 

అయితే లుక్ ఏ మాత్రం మారినా బెడిసి కొట్టే అవకాశం ఉందని రెగ్యులర్ గానే కూల్ గా ఉంటే రిస్క్ ఉండదని ఆన్సర్ ఇచ్చాడట. బాడీ లాంగ్వేజ్ లో మాత్రం మహేష్ కాస్త డిఫరెంట్ గా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ - మహేష్ మధ్యలో కొన్ని సన్నివేశాలు తెరకెక్కుతున్నాయి. అనంతరం ఫ్యాక్షన్ ఎపిసోడ్స్ కి సంబందించిన షెడ్యూల్ ని స్టార్ట్ చేయనున్నారు.