టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం మహర్షి. రిలీజ్ కు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా మే 9 న రిలీజ్ కానుంది. మహేష్ బాబు 25వ సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీగానే అంచనాలు పెంచుకున్నారు. దాంతో బిజినెస్ కూడా బాగా జరిగిందని అంతా భావించారు. అయితే ఈ చిత్రం గురించిన ఆశ్చర్యకరమైన విషయం ప్రముఖ  ఆంగ్ల పత్రికలో రావటం ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. 

అదేమిటంటే...మహర్షి చిత్రం డెఫెషిట్ లో రిలీజ్ అవుతోంది.   ఈ సినిమా బడ్జెట్ 130 కోట్లు అయ్యిందని,  ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం 110 కోట్లు మాత్రమే జరిగిందని, ఇంకా ఇరవై కోట్లు నష్టంలోనే రిలీజ్ కాబోతోందని చెప్తున్నారు. అయితే సినిమా డెఫెషిట్ లో రిలీజ్ అయ్యినప్పటికీ సినిమా ఘన విజయం సాధిస్తుందని, కొన్ని చోట్ల షేర్ పద్దతిన రిలీజ్ చేస్తున్నారని, అక్కడ మంచి లాభాలు వస్తాయని, అలాగే డిజిటిల్ మార్కెట్, శాటిలైట్ వంటివి ఈ సినిమాకు రికవరీ చేసి లాభాల బాటలో నడిపిస్తాయని భావిస్తున్నారు. 

ఇక ఈ సినిమాపై పెరిగిన అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్‌ ఏకంగా 11 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తుండగా పూజా హెడ్గేహీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే దేవిశ్రీ సంగీతమందించిన మహర్షి పాటలు యూటూబ్ లో వ్యూస్ పరంగా దుమ్ములేపుతున్నాయి.