సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి సినిమా ఎవరితో చేయబోతున్నారనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. సుకుమార్ పక్కకి తప్పుకోవడంతో అనీల్ రావిపూడి సినిమాను పట్టాలెక్కించడానికి మహేష్ సిద్ధమవుతున్నాడు.

దిల్ రాజు, అనీల్ సుంకర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తారని సమాచారం. ఇప్పుడు ఈ సినిమాకు మహేష్ బాబు తీసుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాపై మహేష్ అంతగా ఆసక్తి చూపడానికి కారణం కూడా రెమ్యునరేషన్ అని తెలుస్తోంది.

అనీల్ రావిపూడి- మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ఈ సినిమా ప్రొడక్షన్ విలువ యాభై కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇది మహేష్ రెమ్యునరేషన్ కాకుండా.. అయితే జియో టీవీ నుండి మొత్తం డిజిటల్ రైట్స్ అన్ని భాషలకు సంబంధించి యాభై కోట్లు ఆఫర్ చేశారట.

సో ప్రొడక్షన్ కాస్ట్ ఆ విధంగా వచ్చేస్తుంది. ఇక సినిమా థియేట్రికల్ రైట్స్ ఎలా లేదన్నా.. వంద కోట్ల  బిజినెస్ అవుతుంది. అందులో మహేష్ కి సగానికి సగం  రెమ్యునరేషన్ గా ఇస్తామని ఆఫర్ చేశారట. ఆ లెక్కన చూసుకుంటే మహేష్ కి యాభై కోట్లు ముట్టజెప్పబోతున్నారన్నమాట.