యంగ్ హీరో అడివి శేషు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం మేజర్. 2008లో ముంబై వేదికగా జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ ఉన్ని కృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతుంది. ఉగ్రవాదులతో పోరాడి అమరుడైన ఉన్ని కృష్ణన్ పాత్రను అడివి శేషు పోషిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో విడుదల చేయనున్నారు. 

ఏడాది కాలంగా మేజర్ చిత్రీకరణ జరుపుకుంటుంది. 2019లోనే మేజర్ సెట్స్ పైకి వెళ్లినట్లు సమాచారం. కాగా నేడు మేజర్ మూవీ  విడుదల తేదీని ప్రకటించారు . 2021 జులై 2న మేజర్ మూవీ థియేటర్స్ లోకి రానున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.  మేజర్ మూవీ నిర్మాతలైన మహేష్, నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో విడుదల తేదీ పోస్టర్ పంచుకోవడం జరిగింది. 

జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, సోనీ పిక్చర్స్ మరియు ఏ ప్లస్ ఎస్  మూవీస్ ప్రొడక్షన్స్ కలిసి మేజర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఇక మేజర్ మూవీ కోసం అడివి శేషు చాలా కష్టపడ్డారు.  కొన్ని ఆర్మీ క్యాంప్స్ ని సందర్శించి అనేక విషయాలు కనుగొన్నారు.  ముఖ్యంగా మరణించిన సందీప్ ఉన్ని కృష్ణన్ కుటుంబాన్ని పలుమార్లు కలిసి ఆయన గురించి అనేక విషయాలు సేకరించారు. కఠిన కసరత్తులు చేసి పాత్రకు అనుకూలంగా తన శరీరాన్ని మార్చుకున్నాడు.  కాగా మేజర్ చిత్రాన్ని దర్శకుడు శశి కిరణ్ తిక్కా తెరకెక్కిస్తున్నారు.