మహేష్ కొత్త మూవీ షూటింగ్ కి సిద్ధమవుతున్నాడు. ఆగస్టు నుండి త్రివిక్రమ్ మూవీ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండగా... ఆయన ఫారిన్ టూర్ కి వెళ్లారు. మహేష్ లేటెస్ట్ లుక్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది. 


సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) చిత్రంతో మరో హిట్ మహేష్(Mahesh babu) ఖాతాలో వేసుకున్నాడు. దర్శకుడు పరుశురాం తెరకెక్కించిన సర్కారు వారి పాట సందేశంతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఆకట్టుకుంది. మహేష్-కీర్తి రొమాన్స్ తో పాటు థమన్ సాంగ్స్ అలరించాయి. మొత్తంగా సర్కారు వారి పాటతో మహేష్ సక్సెస్ జర్నీ కంటిన్యూ చేశారు. ఇదిలా ఉంటే మహేష్ తన తదుపరి ప్రాజెక్ట్ త్రివిక్రమ్ తో కమిటైన విషయం తెలిసిందే. మహెహ్ 28వ(SSMB 28) చిత్రంగా ఈ మూవీ తెరకెక్కనుంది. 

ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే పట్టాలెక్కాల్సి ఉంది. అయితే పలు కారణంతో మూవీ ఆలస్యమైంది. అడ్డంకులన్నీ తొలగి సర్వం సిద్ధం కాగా ఆగస్టు నుండి మహేష్-త్రివిక్రమ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ప్రత్యేకమైన సెట్స్ కూడా ఏర్పాటు చేశారట. ఇక షూటింగ్ మొదలు కావడానికి రోజులు మాత్రమే మిగిలి ఉండగా ఫ్యామిలీతో మహేష్ లండన్ వెళ్ళాడు. అక్కడ ఒకటి రెండు వారాలు గడపనున్నారు. ఈ క్రమంలో మహేష్ తన లేటెస్ట్ లుక్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. 

View post on Instagram

ఎల్లో టీ షర్ట్ క్యాప్ ధరించిన మహేష్ క్లీన్ షేవ్ లో సూపర్ కూల్ గా ఉన్నారు. ఇక మహేష్ లేటెస్ట్ లుక్ వైరల్ గా మారింది. ఇక ప్రతిసినిమా మొదలు కావడనికి ముందు అలాగే విడుదలయ్యాక ఫ్యామిలీ తో ట్రిప్స్ కి వెళుతూ ఉంటారు. అది ఆయనకు సెంటిమెంట్ తో పాటు ఖాళీ సమయం దొరికితే అలా కుటుంబంతో గడపడానికి ఇష్టపడతారు. ప్రతి ఏడాది మహేష్ ఫ్యామిలీ పదుల సంఖ్యలో ట్రిప్స్ కి వెళుతూ ఉంటారు. మహేష్ కి అదో పెద్ద సరదా... 
a