మహేష్ నమ్రత గారాల పట్టి సితార. నమ్రత-మహేష్ జంట ఏ ఫంక్షన్ కు అటెండైనా పిల్లలు కూడా వారితో పాటు ఉంటారు. ఇప్పటికే కొడుకు గౌతమ్ సినిమాల్లో కూడా తెరంగేట్రం చేసి సత్తా చాటారు. అయితే కూతురు సితార మాత్రం ఇంకా స్క్రీన్ ను షేర్ చేసుకోలేదు. అయితే ఇటీవల సితార తండ్రి మహేష్ కు ఒక సర్ ప్రైజ్ ఇచ్చింది.

 

సితార ముద్దుగా బొద్దుగా ఉంటుంది. ఇక ఉంగరాల జుట్టు ప్రత్యేక ఆకర్షణ. మహేష్ హెయిర్ సాఫ్ట్ గా ఉంటుంది. నమ్రత హెయిర్ కొంచెం హార్డ్. సితార హెయిర్ మాత్రం ఫుల్ కర్లీగా ఉంటుంది. అదే ఆ అమ్మాయికి అట్రాక్షన్ అని అందరూ ఫీలవుతుంటారు. అయితే సితారకు మాత్రం ఆ హెయిర్ బోర్ కొట్టినట్లుంది. వెంటనే ఆ హెయిర్ ను స్ట్రైయిట్ చేయించాలనుకుంది. అనుకున్నదే తడవుగా అమ్మ నమ్రతకు చెప్పి హెయిర్ స్ట్రెయిటనింగ్ చేయించుకుంది.

 

ఉంగరాల జుట్టు ఒక్కసారిగా స్ట్రెయిట్ గా, సాఫ్ట్ గా తయారయ్యే సరికి సితార ఆనందంతో గంతులేసింది. తన ఆనందాన్ని వెంటనే వాళ్ల డాడీ మహేష్ కు చూపించాలని తెగ ఆరాటపడిపోయింది. అంతే.. వెంటనే మహేష్ షూటింగ్ కు బయలుదేరి వెళ్లింది. వాళ్ల నాన్నకు తన జుట్టును చూపిస్తూ తెగ మురిసిపోయింది. ఈ దృశ్యాన్ని సెట్స్ లో ఉన్నవాళ్లంతా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. అనంతరం సెట్స్ లో ఉన్నవాళ్లంతా సితారతో కలిసి ఫోటోలు దిగారు.

 

ఈ విషయాన్ని నమ్రత ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. భరత్ అను నేను షూటింగ్ లో మహేష్ బిజీగా ఉన్నాడు. సితార ఆ షూటింగ్ సెట్స్ కే వెళ్లి సందడి చేసింది. కైరా అద్వాణీతో కలిసి ఫోటోలు దిగింది. ఎవరిది లాంగ్ హెయిర్ అని పోటీ పడింది.