టాలెంట్ ను ప్రోత్సహించడంలో ముందుంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు.  తనకు నచ్చిన సినిమా ని ట్వీట్ చేసి ప్రమోట్ చేయటానికి ప్రయత్నిస్తూంటారు. తాజాగా ఆయన “జాతి రత్నాలు” చూసారు. ఈ సినిమా గురించి, అందులో నవీన్ నటన గురించి ఓ రేంజిలో ఎలివేషన్ ఇస్తూ ట్వీట్ చేసారు ఆయన. 
 
నవీన్ హీరోగా చెయ్యక ముందే ”లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” చేసారు. అలాగే మహేష్ తో “1 నేనొక్కడినే” లో తన వీరాభిమానిగా కూడా కనిపించాడు.  అప్పటి రోజులలో నవీన్ గు గుర్తు చేసి “1 సెట్స్ తో అతనితో మాట్లాడిన సందర్భం ఇంకా గుర్తు ఉందని అతని మాటల్లో స్పష్టత, సెట్స్ తన ప్రవర్తన అంతా చూస్తే ఈ అబ్బాయిలో ఏదో స్పార్క్ ఉందని అనిపించిందని ఇక ఈ సినిమాలో అతని అద్భుత నటన చూసి నా మైండ్ బ్లో చేసాడని” నవీన్ గురించి మహేష్ అన్నారు.

అంతే కాకుండా “జాతి రత్నాలు” టీం అందరికీ కంగ్రాట్స్ చెబుతూ తాను సూపర్బ్ గా ఎంజాయ్ చేసానని తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు.  

https://twitter.com/urstrulyMahesh/status/1370632510007222276