హైదరాబాద్‌లోని గచ్చిబౌలీలో మహేష్ బాబు నిర్మించిన ఏఎంబీ సినిమాస్ ఆదివారం అట్టహాసంగా  ప్రారంభమైన సంగతి తెలిసిందే. అత్యాధునిక హంగులతో ఏషియన్‌ సినిమాస్‌తో కలిసి ఈ మల్టిఫ్లెక్స్ డిజైన్ చేసారు.  మొత్తం ఏడు స్క్ర్రీన్లతో, 1,600 సీటింగ్ కెపాసిటీతో ఉన్న థియేటర్లో 2.0 చిత్రం మొదటి సినిమాగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపధ్యంలో ఈ మల్టిఫ్లెక్స్ లో మహేష్ బాబు వాటా ఎంత అనేది అందరిలో చర్చనీయాంశంగా మారింది.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ మల్టిఫ్లెక్స్ లో మహేష్ బాబుకు ఇరవై శాతం మాత్రమే వాటా ఉంది. మహేష్ బాబు  ఏఎంబీ సినిమాస్ లో కొంత మొత్తం పెట్టుబడి పెట్టారు. అలాగే ఆయన ఈ  ఏఎంబీ సినిమాస్ కు బ్రాండింగ్ చేయనున్నారు. దాని నిమిత్తం ఆయనకు మరికొంత షేర్ ఉంటుంది. ఆయనకు రెండు స్క్రీన్స్ నుంచి వచ్చే లాభాల్లో షేర్ ఉంటుంది. ఈ ప్రాజెక్టులో మరో నలుగురు పార్టనర్స్ ఉన్నారు. ఈ స్క్రీన్స్ అన్నీ ఏషియన్ సినిమాస్ కు లీజ్ లో ఉంటాయి. ఈ  ఏఎంబీ సినిమాస్ సక్సెస్ స్దాయి ని బట్టి, ఆంధ్రా, తెలంగాణాల్లో వీళ్లవే మరిన్ని మల్టిఫ్లెక్స్ లు వచ్చే అవకాసం ఉంది. 

ఏఎంబీ సినిమాస్ లో  టికెట్‌ ధర రూ. 230 నుంచి ప్రారంభమవుతుంది. మీడియాలో జరుగుతున్న ప్రచారం బట్టి...జనం ఇక్కడ సినిమా చూడాలని ఉత్సాహపడుతున్నారు. ఇప్పటికే  నాలుగు రోజుల పాటు టికెట్లు ఇప్పటికే బుక్‌ అయినట్టు తెలిసింది. ఇప్పటికే ఇక్కడ  ఏఎంబీ సినిమాస్ ల సినిమా  చూసినవారు తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని ఆధునిక వసతులతో కూడిన థియేటర్ మరొకటి లేదని చెబుతున్నారు. ఏఎంబీ సినిమాస్‌లో పడుకుని చిత్రాన్ని చూసే వెసులుబాటు ఉంది. మరి త్వరగా టిక్కెట్ బుక్ చేసుకోండి.