ఎన్టీఆర్ సాంగ్ కాపీ చేసి మహేష్ గుంటూరు కారం కి బీజీఎం... మళ్ళీ దొరికిపోయిన థమన్?
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న థమన్ పై కాపీ ఆరోపణలు కొత్తేమీ కాదు. మహేష్ లేటెస్ట్ మూవీ గుంటూరు కారం కి ఆయన పనిచేస్తుండగా కాపీ ఆరోపణలు మరలా తెరపైకి వచ్చాయి.

కొన్నాళ్లుగా తెలుగు పరిశ్రమను దేవిశ్రీ, తమన్ ఏలుతున్నారు. మణిశర్మ, కోటి వంటి సీనియర్స్ డౌన్ అయ్యాక వీరిదే హవా. అయితే దేవిశ్రీదే పై చేయిగా ఉంటూ వచ్చింది. థమన్ రేంజ్ ఓ దశలో టైర్ టూ హీరోలకు పడిపోయింది. త్రివిక్రమ్ థమన్ కి బ్రేక్ ఇచ్చాడు. అరవింద సమేత, అల వైకుంఠపురంలో చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నాడు. ఒకప్పుడు దేవిశ్రీ త్రివిక్రమ్ సినిమాలకు పనిచేసేవాడు. అ ఆ, అజ్ఞాతవాసి చిత్రాలకు వేరే దర్శకులను తీసుకున్నారు.
అల వైకుంఠపురంలో ఆల్బమ్ తమన్ ని ఎక్కడికో లేపింది. ఆ చిత్రానికి పోటీగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు దేవిశ్రీ సంగీతం అందించారు. 2020 సంక్రాంతి పోటీలో దేవీశ్రీపై తమన్ పూర్తి ఆధిపత్యం చూపించాడు. సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్. థమన్ వెంట స్టార్ హీరోలు పడే పరిస్థితి వచ్చింది. గత రెండు మూడేళ్ళలో విడుదలైన అన్ని పెద్ద సినిమాలకు థమన్ పని చేశారు, చేస్తున్నారు.
అయితే కాపీ ఆరోపణలు ఆయన్ని వదలడం లేదు. ఆయన ప్రతి సినిమాకు అబాసు పాలవుతున్నారు. క్రాక్ మూవీలో 'బంగారం' సాంగ్ ని ఓ యూట్యూబ్ సాంగ్ నుండి కాపీ చేశాడన్నారు. ఇక వీరసింహారెడ్డి మూవీలో జై బాలయ్య సాంగ్ 'ఒసేయ్ రాములమ్మ' టైటిల్ సాంగ్ లా ఉందని ఎగతాళి చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. థమన్ ఈ ఆరోపణలు ఎంజాయ్ చేయడం విశేషం. తనని నేరుగా అడిగినప్పుడు జస్ట్ నవ్వేస్తారు.
తాజాగా మరోసారి ఆయన కాపీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన గుంటూరు కారం చిత్రానికి థమన్ పని చేస్తున్నారు. నేడు సూపర్ స్టార్ కృష్ణ జయంతి పురస్కరించుకుని ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేశారు. ఈ వీడియోకి థమన్ ఇచ్చిన బీజీఎం కాపీ అంటున్నారు. థమన్ కాంపిటీటర్ అయిన దేవిశ్రీ నాన్నకు ప్రేమతో సినిమాకు ఇచ్చిన సాంగ్ లోని ట్యూన్ వాడేశాడట.
నాన్నకు ప్రేమతో మూవీలో క్లైమాక్స్ లో అరబిక్ స్టయిల్ లో ఓ సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ కి దేవిశ్రీ ఇచ్చిన ట్యూన్స్ ని కాపీ చేసి గుంటూరు కారం చిత్రానికి బీజీఎం ఇచ్చారన్న వాదన మొదలైంది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. నెటిజెన్స్ వీడియో వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియా యుగంలో ఈ మాత్రం అరువు తీసుకున్నా వెంటనే దొరికిపోతున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.