సూపర్ స్టార్ మహేష్ బాబుకు మరో అరుదైన గౌరవం దక్కింది.  హీరోగా 21 ఏళ్ల  కెరీర్‌లో తన నటనతో ఎన్నో అవార్డులు అందుకున్నారు మహేష్ బాబు. తాజాగా మహేష్ బాబు‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. మహేష్ బాబుకు ఫిట్నెస్ విషయంలో Synt Globla Spa Fit and Fab Wellness Icon Award దక్కింది.  ఈ విషయాన్నిమహేష్ బాబు తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఫిట్నెస్ అనేది అంత ఈజీ కాదు. కానీ అసాధ్యం మాత్రం కాదు అని అన్నారాయన.

ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు వారి పాట’.. ఇటీవలే దుబాయ్‌లో షూటింగ్ పూర్తి చేసుకుంది. మహేష్ పక్కన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఇప్పటికే  2022 సంక్రాంతికి ‘సర్కారు వారి పాట’ ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. 2020 పెద్ద పండక్కి ‘సరిలేరు నీకెవ్వరు’ తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన మహేష్, వచ్చే ఏడాది ‘సర్కారు వారి పాట’ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తాడని ఆశిస్తున్నారు సూపర్‌స్టార్ ఫ్యాన్స్.

మహేష్ కెరీర్లో మొట్టమొదటి సారిగా పాన్ ఇండియా లెవల్లో ‘సర్కారు వారి పాట’ తెరకెక్కుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లోనూ ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. సంగీతం : థమన్, కెమెరా : మది, ఎడిటింగ్ : మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ : ఏ ఎస్ ప్రకాష్, నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట.