వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న మహేష్ బాబు కరోనా తో కాస్తంత బ్రేక్ ఇచ్చారు. అయితే ఆయన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూసే అభిమానులకు లోటు లేదు. ఆ విషయం రిలీజ్ రోజు ఓపినింగ్సే చెప్పాస్తాయి. టాలీవుడ్ ప్రిన్స్ గా, సూపర్ స్టార్ గా వెలుగుతున్న మహేష్ బాబు సినిమాకు ఎంత తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏమన్నా పెంచారా, తాజాగా కమిటైన త్రివిక్రమ్ సినిమాకు ఎంత తీసుకుంటున్నారు అనేది సినీ లవర్స్ లో ఇంట్రస్టింగ్ టాపిక్. 

సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు...త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా నిమిత్తం మహేష్ బాబు  కెరీర్ లోనే అత్యదిక రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. SSMB 28 చెప్పబడుతున్న ఈ సినిమా నిమిత్తం సూపర్ స్టార్ సాలీడ్ రెమ్యునరేషన్ అందుకొనున్నట్లు టాక్ . మామూలుగా మహేష్ తన ప్రతి సినిమాకు GMB ప్రొడక్షన్ ని..నిర్మతగా కలిపి లాభాల్లో వాటా అందుకుంటూ వస్తున్నాడు.

అయితే ఈ సారి హారిక హాసిని క్రియేషన్స్ సోలోగానే ప్రొడ్యూస్ చేయడానికి నిర్ణయించుకోవటంతో మహేష్ కు అత్యధికంగా 65కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు చెప్తున్నారు.  మహేష్ సరిలేరు నీకెవ్వరు కోసం 50కోట్ల వరకు అందుకున్నట్లు వినిపించింది.  

చిత్రం విశేషాలకు వస్తే.. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మొదటి చిత్రం ‘అతడు’లోని మహేష్ పేరు(పార్థు)నే ఈ సినిమాకి టైటిల్‌గా పెట్టబోతున్నారంటూ కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ‌(చిన‌బాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన‌రోజైన మే 31న పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం అయ్యే ఈ చిత్రం 2022 స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా రిలీజ్ చేస్తామని మేకర్స్ చెబుతున్నారు.