సారాంశం

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు నెక్ట్స్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. చాలా కాలంగా దీనికి సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై మహేష్‌ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు.

మహేష్‌బాబు ప్రస్తుతం `గుంటూరు కారం` చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ మధ్య సినిమా షూటింగ్‌కి చాలా గ్యాప్‌ రావడంతో ఇప్పుడు గ్యాప్‌ లేకుండా చిత్రీకరిస్తున్నారు. దీంతో మహేష్‌ ఫుల్‌ బిజీగా ఉంటున్నారు. తాజాగా ఆయన తన భార్య నమ్రత శిరోద్కర్‌తో కలిసి ప్రైవేట్‌ ఈవెంట్‌లో పాల్గొన్నారు. గౌరీ సిగ్నేచర్‌ షోరూమ్‌ ఓపెనింగ్‌లో పాల్గొన్నారు. నమ్రతతో కలిసి మహేష్‌ ఈ షోరూమ్‌ని ప్రారంభించారు. 

ఫస్ట్ టైమ్‌ తన వైఫ్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు మహేష్‌బాబు. ఇందులో మంచి డిజైన్స్ ఉన్నాయని నిర్వహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఓ డిజైన్‌ని నాలుగు నెలలు వర్క్ చేసి రూపొందించారని తెలిసి ఆశ్చర్యపోయినట్టు, ఆ వర్క్ చాలా బాగుందన్నారు మహేష్‌. అలాగే ఈ సందర్భంగా రాజమౌళితో సినిమాపై ప్రశ్న ఎదురైంది. దీనికి మహేష్‌ ఫన్నీగా స్పందించారు. `చెప్తాము సర్‌, కంగారు పండకండి`.. అంటూ నవ్వుతూ రియాక్షన్‌ ఇచ్చారు. అది ఆద్యంతం నవ్వులు పూయించింది. అలాగే `గుంటూరు కారం`పై ప్రశ్నలకు స్పందిస్తూ, సినిమా చూస్తే తెలుస్తుంది. ఫుల్‌ డైలాగులే ఉంటాయని చెప్పడం విశేషం. 

ఇక గౌరీ సిగ్నేచర్‌ వెడ్డింగ్‌ అటెలియర్‌ స్పెషాలిటి గురించి నమ్రతా శిరోద్కర్ గారు మాట్లాడుతూ,  గౌరీ సిగ్నేచర్స్  CEO ఉదయ్ సాయి కౌతవరపు వారి బ్రాండ్  వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ తయారీ నుండి రిటైల్ వరకు ప్రత్యేకమైన బెస్పోక్ వెడ్డింగ్ సిగ్నేచర్ ఎంసెంబ్ల్స్ బ్రాండ్‌గా అభివృద్ధి చేశారన్నారు.

 వధూవరులు, వారి కుటుంబం మొత్తం పెళ్లి కోసం కస్టమ్ డిజైనర్ డ్రెస్‌ల కోసం మాత్రమే కాకుండా, ఎంచుకున్న వస్త్రాలకు సరిపోయే ఆభరణాలకు వెతుకుతున్న డిమాండ్ కారణంగా ఈ గౌరీ సిగ్నేచర్స్ పుట్టింది. సంప్రదాయం, హస్తకళా నైపుణ్యం తో కూడిన ఈ స్టోర్ లగ్జరీ యొక్క సారాంశాన్ని నిర్వచించే కళాత్మకత మరియు అంకితభావానికి నిదర్శనంగా నిలుస్తుందని నిర్వహకులు ఉదయ్‌ సాయి తెలిపారు. వెడ్డింగ్‌కి సంబంధించిన అన్నిరకాల డిజైన్స్, దుస్తులు లభిస్తాయి, చిన్న, పెద్ద, వృద్ధుల వరకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. గ్రాండియర్‌కి, రాయల్‌ లుక్‌కి కేరాఫ్‌గా తన డిజైన్స్ నిలుస్తాయని చెప్పారు. హైదరాబాద్‌లోని రోడ్‌ నెం 36లో ఈ గౌరీ సిగ్నేచర్‌ షోరూమ్‌ని ప్రారంభించారు.