బిగ్‌ సీ(big c)కి ఆయన ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు బిగ్ సి సంస్థ మహేష్‌ బాబు(mahesh babu)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇకపై బిగ్ సి ప్రచారకర్తగా మహేష్‌ బాబు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుక్రవారం దీనికి సంబంధించిన ప్రెస్‌మీట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. 

మహేష్‌బాబు కమర్షియల్‌ బ్రాండ్స్ కి బెస్ట్ అండ్‌ టాప్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నాడు. ఆయన చేతిలో పదికిపైగా బ్రాండ్లు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఆయన చేతిలోకి మరో బ్రాండ్‌ వచ్చి చేరింది. బిగ్‌ సీకి ఆయన ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు బిగ్ సి సంస్థ మహేష్‌ బాబుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇకపై బిగ్ సి ప్రచారకర్తగా మహేశ్ బాబు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుక్రవారం దీనికి సంబంధించిన ప్రెస్‌మీట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బిగ్ సి సంస్థకు ఇప్పటివరకు అంబాసిడర్లుగా వ్యవహరించింది హీరోయిన్లే కాగా, ఇప్పుడు మహేష్‌ బాబు రూపంలో తొలిసారిగా ఓ హీరో బిగ్ సి సంస్థకు అంబాసిడర్ గా నియమితులయ్యారు. ఇదే ప్రశ్నను ఓ మీడియా ప్రతినిధి మహేశ్ బాబును ప్రశ్నించగా, బిగ్ సి అంబాసిడర్ స్థానాన్ని మహిళల నుంచి కొట్టేశానని భావించడం లేదంటూ చమత్కరించారు. బిగ్ సితో కలిసి నడవనుండడం తనకు లభించిన గౌరవంగా భావిస్తానని తెలిపారు.

ఈ ప్రెస్‌మీట్‌లో బ్లూ టీషర్ట్ లో స్టయిలీష్‌ లుక్‌లో మెరిశారు మహేష్‌. ఇదిలా ఉంటే ఇటీవల అటు `సాక్షి ఎక్స్ లెంట్‌` అవార్డుని, మరోవైపు `సైమా` అవార్డులను మహేష్‌ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేష్‌ `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతుంది.