సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. మంచు మనోజ్‌ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నిందితుడుని పట్టుకుని 24గంటల్లో ఉరితీయాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు తాజాగా మహేష్‌ బాబు స్పందించారు. వ్యవస్థపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మనం ఎలాంటి సమాజంలో ఉన్నామని ప్రశ్నించారు.

సైదాబాద్‌, సింగరేణి కాలనీలోని ఆరేళ్ల బాలికపై జరిగిన అత్యాచార హత్య ఘటన తెలంగాణ రాష్ట్రాన్ని షేక్‌ చేస్తుంది. ఇప్పటి వరకు నిందితుడు పల్లకొండ రాజు ఆచూకి కోసం పోలీసులు పది బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని పట్టిస్తే పది లక్షల ఇస్తామని పోలీసులు నజరానా ప్రకటించారు. ఘటన జరిగి ఆరు రోజులవుతున్నా ఇంకా నిందితుడిని పట్టుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ నేపథ్యంలో దీనిపై సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. మంచు మనోజ్‌ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నిందితుడుని పట్టుకుని 24గంటల్లో ఉరితీయాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు తాజాగా మహేష్‌ బాబు స్పందించారు. వ్యవస్థపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మనం ఎలాంటి సమాజంలో ఉన్నామని ప్రశ్నించారు. ఘటనపై, అధికారులపై మహేష్‌ అసహనం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ ద్వారా మండిపడ్డారు.

`సింగరేణి కాలనీలోని ఆరేళ్ల చిన్నారిపై జరిగిన ఘోరమైన నేరం మనం సమాజంగా ఎంతగా దిగజారిపోయామో గుర్తు చేస్తుంది. `మా కుమార్తెలు ఎప్ఉపడైనా సురక్షితంగా ఉంటారా?` అనేది ఎల్లప్పుడూ ఒక ప్రశ్న. సమాజం గగ్గోలు పెడుతుంది. బాధిత కుటుంబం ఎంతటి బాధని అనుభవిస్తుందో ఊహించలేదు. త్వరిత గతిన చర్యని నిర్ధారించి, చిన్నారికి, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నా` అని ట్వీట్‌ చేశారు మహేష్‌. 

Scroll to load tweet…