#MaheshBabu:మహేష్ 'మహర్షి' కథ కూడా కాపీయేనా, కోర్టుకు వెళ్లబోతున్నారా?

'మహర్షి' సినిమా విషయంలో తన హక్కును పొందేందుకు కోర్టును ఆశ్రయిస్తానని అంటున్నారు. శరత్ చంద్ర కామెంట్స్ చేయడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

Mahesh Babu Film Maharshi A Complete Copy Claims Writer jsp


వీకెండ్ వ్యవసాయం, రైతుల కష్టాలు నేపథ్యంలో తెరకెక్కిన మహర్షి  సినిమా 2019 లో హైయెస్ట్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో మహేష్ బాబు స్నేహితుడిగా అల్లరి నరేష్.. హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించారు.న 67 వ జాతీయ అవార్డుల్లో 3 నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది. తెలుగు భాష నుంచి ఉత్తమ వినోదాత్మక చిత్రంగా జాతీయ అవార్డు సొంతం చేసుకుంది మహర్షి. అలాగే ఈ సినిమాను నిర్మాణ సంస్థలో ఒకటైన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌజ్‌ను ఉత్తమ నిర్మాణ సంస్థగా నేషనల్ అవార్డు వరించింది. మహర్షి సినిమాను PVPతో కలిసి దిల్ రాజు మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. ఇప్పుడీ సినిమా కాపీ రైట్ వివాదాల్లో చిక్కుకుపోతాందా అంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమా కూడా తన కథ నుంచి కాపీ చేసిన కథే అంటున్నారు  శరత్‌ చంద్ర .

'మహర్షి'. ఈ సినిమా కథ కూడా కాపీ అంటూ ఆర్. డి. విల్సన్ అలియాస్  శరత్‌ చంద్ర ఓ యూట్యూబ్ ఛానెల్ తో  మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. తను రాసిన 'సమాహారం' అనే నవలలోని కొన్ని సన్నివేశాలు ఈ చిత్రంలో కనిపిస్తున్నాయని అన్నారు. 'శ్రీమంతుడు' కేసుపై తీర్పు వెలువడగానే, 'మహర్షి' సినిమా విషయంలో తన హక్కును పొందేందుకు కోర్టును ఆశ్రయిస్తానని అంటున్నారు. శరత్ చంద్ర కామెంట్స్ చేయడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్వాతి వారపత్రికలో ప్రచురితమైన తన 'చచ్చేంత ప్రేమ' కథ నుండి సీన్ బై సీన్ కాపీ చేసి 'శ్రీమంతుడు' సినిమా తీశారని శరత్ చంద్ర ఆరోపిస్తూ వస్తున్నారు. 

ఈ వివాదం ఓ కొలిక్కి రాకముందే.. ఇప్పుడు వంశీ పైడిపల్లి కూడా తన కథను కాపీ కొట్టి 'మహర్షి' సినిమా తీసినట్లుగా రచయిత ఆరోపిస్తున్నారు. చిత్రంగా ఈ రెండు సినిమాల్లోనూ మహేష్ బాబే హీరో. మరి దీనిపై ప్రొడ్యూసర్ దిల్ రాజు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఎలా స్పందిస్తారో చూడాలి. ఇదిలా ఉంటే ఇటీవల 'బేబీ' మూవీకి కూడా కాపీ వివాదం మొదలైంది. స్టోరీ తనదేనంటూ శిరిన్‌ శ్రీరామ్‌ అనే షార్ట్‌ ఫిల్మ్ డైరెక్టర్‌ హైదరాబాద్‌ లోని రాయదుర్గంలో ఫిర్యాదు చేశారు. 2015లో తాను రాసుకున్న 'ప్రేమించొద్దు' అనే కథను సాయి రాజేశ్ కు చెప్పానని, కాపీ రైట్ చట్టాన్ని బేబీ ఉల్లంఘించి తన కథనే బేబీ సినిమాగా తీశారని ఆరోపించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios