గుంటూరు కారం ఒక కొలిక్కి రాలేదు. అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ పాన్ ఇండియా ప్రకటన చేశాడు. ఈ క్రమంలో మహేష్ బాబు ఫ్యాన్స్ ఆయనపై గుర్రుగా ఉన్నారు.  

మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా గుంటూరు కారం తెరకెక్కుతుంది. ఈ మూవీ ప్రకటన నాటి నుండి హీరో దర్శకుడు మధ్య కో ఆర్డినేషన్ లేదు. అనుకున్న సమయానికి మూవీ పట్టాలెక్కలేదు. తీరా షూటింగ్ మొదలయ్యాక స్క్రిప్ట్ లో మార్పులు చేశారు. ఇటీవల ఓ షెడ్యూల్ పూర్తి కాకుండానే మహేష్ విదేశాలకు చెక్కేశాడనే వాదన వినిపించింది. ఆయన తిరిగొచ్చాక కూడా షూటింగ్ అనుకున్నట్లు జరగడం లేదు. జూన్ 12న మొదలు కావాల్సిన షెడ్యూల్ జులై కి షిఫ్ట్ అయ్యింది. 

పూజా హెగ్డే ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. మరో ఆరు నెలల్లో విడుదల అంటున్నారు. ఇంతవరకు సగం షూటింగ్ కూడా కంప్లీట్ కాలేదు. ఫస్ట్ ఆగస్టు లేదా అక్టోబర్ లో విడుదల చేయాలనుకున్నారు. 2024 సంక్రాంతికి అంటూ అధికారిక ప్రకటన చేశారు. చూస్తుంటే సంక్రాంతికి గుంటూరు కారం కష్టమే అంటున్నారు. సెట్స్ పై ఉన్న మూవీ చుట్టూ సమస్యలు, సందేహాలు. 

సడన్ గా త్రివిక్రమ్ మరో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు. అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ తన దర్శకత్వంలో చేస్తున్నట్లు వెల్లడించారు. ఈసారి భారీ ప్రాజెక్ట్ సెట్ చేశామంటూ హింట్ ఇచ్చారు. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని సమాచారం. గుంటూరు కారం ఒక కొలిక్కి రాకుండానే అల్లు అర్జున్ తో మూవీ ప్రకటించడం అవసరమా అంటూ మహేష్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

కొన్నాళ్లుగా త్రివిక్రమ్ హీరోలను ఇలానే కన్ఫ్యూస్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ తో మూవీ ప్రకటించి పవన్ రీమేక్ చిత్రాల పనుల్లో బిజీ అయ్యాడు. దాంతో ఎన్టీఆర్ పక్కన పెట్టేశాడు. తెలివిగా మహేష్ ని లాక్ చేశాడు. ఇప్పుడు కూడా అదే చేశాడు. భీమ్లా నాయక్, వినోదయ సితం వంటి రీమేక్ చిత్రాలకు స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తూ మహేష్ మూవీపై దృష్టి పెట్టలేదు. పవన్ రిమేక్ చిత్రాలతో త్రివిక్రమ్ కోట్లు సంపాదిస్తున్నాడు. కమిటైన హీరోలు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. అవకతవకలతో సాగుతున్న గుంటూరు కారం మూవీ మీద అంచనాలు లేవు. చెప్పాలంటే వివాదాలతో హైప్ కోల్పోయింది.