సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం 'మహర్షి'. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్, పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ బాబు నటిస్తోన్న 25వ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే దిల్ రాజు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను రిలీజ్ డేట్ మారిందని ఏప్రిల్ 25న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మహేష్ బాబు అభిమానుల నుండి దిల్ రాజు విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఏప్రిల్ 25న సినిమాను రిలీజ్ చేయొద్దని, డేట్ మార్చాలని మహేష్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో దిల్ రాజుని టార్గెట్ చేస్తూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఏప్రిల్ 26న హాలీవుడ్ సినిమా 'అవెంజర్స్: ఎండ్ గేమ్' సినిమా విడుదలవుతోన్న నేపధ్యంలో మహేష్ 'మహర్షి' విడుదల తేదీ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. 

అవెంజర్స్ సిరీస్ కి తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అందులో వచ్చే ఆఖరి సినిమా అంటే క్రేజ్ ఎంతగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. దీంతో మహేష్ సినిమాపై ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆ కారణంగానే సినిమా రిలీజ్ డేట్ మార్చాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.