‘అమ్మ ప్రతిరోజూ నీకు కృతజ్ఞుడనే’.. తల్లిని గుర్తుచేసుకుంటూ మహేశ్ బాబు ఎమోషనల్ పోస్ట్..
గతేడాది వరుస విషాదాలతో సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) శోకసంద్రంలో మునిగిపోయిన విషయం తెలిసిందే. ఈక్రమంలో తన తల్లి ఇందిరా దేవిని గుర్తుచేసుకుంటూ తాజాగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ఇంట్లో ఏడాది కాలంలో వరుస విషాద ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. ఏడాదిలోనే అన్న రమేశ్ బాబు, తల్లి ఇందిరా దేవి, గతేడాది చివర్లో సీనియర్ నటుడు, సూపర్ స్టార్, తండ్రి క్రిష్ణను కూడా కోల్పోయారు. ఒకరితర్వాత ఒకరు తనను వీడిపోవడంతో మహేశ్ బాబు దిగమింగలేని బాధను అనుభవించారు. ఇప్పుడిప్పుడే ఆ శోఖ సంద్రంలోంచి బయటకొచ్చి సినిమాల్లో బిజీగా అయ్యారు.
తాజాగా తల్లి ఇందిరా దేవిని గుర్తు చేసుకుంటూ ఓ పోస్ట్ పెట్టారు మహేశ్ బాబు. ఇందిరా దేవి పుట్టిన రోజు కావడంతో తల్లితో కలిసి దిగిన ఓ ఫొటోను పంచుకుంటూ ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ. ప్రతిరోజూ నీకు కృతజ్ఞుడను’. అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇందిరా చనిపోవడానికి ముందు మహేశ్ బాబు తల్లి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ సందర్భంగా దిగిన ఓ ఫొటోనే పంచుకున్నారు. ఈ సందర్భంగా మహేశ్ తల్లికి ఫ్యాన్స్ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు.
సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ రెండు పెళ్లిళ్లు జరిగాయి. మొదట ఇందిరాదేవిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నటి విజయ నిర్మలతో వివాహం జరిగింది. వీరికి మొత్తం ఐదుగురు సంతానం. కొడుకులు రమేశ్ బాబు, మహేశ్ బాబు. కూతుర్లు పద్మావతి, మంజూల ఘట్టమనేని, ప్రియదర్శిని ఉన్నారు. వీరిలో రమేశ్ బాబు గతేడాది జనవరి 8న మరణించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 28న ఇందిరా దేవి, నవంబర్ 15న క్రిష్ణ కూడా తుదిశ్వాస విడిచారు. వీరి మరణాలతో మహేశ్ బాబు పుట్టెడు శోకంలో మునిగి తేలారు. సినిమా షెడ్యూళ్లతో బిజీ అయ్యారు.
చివరిగా ‘సర్కారు వారి పాట’తో అలరించిన మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. 12 ఏండ్ల తర్వాత సెట్ అయిన ఈ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం SSMB28 వర్క్ టైటిల్ తో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పూజా హెగ్దే (Pooja Hegde) మహేశ్ సరసన ఆడిపాడుతోంది. హరిక అండ్ హాసిని బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సరసన SSMB29లో నటించబోతున్నారు. ఆఫ్రికన్ అడవుల్లో జంగిల్ అడ్వెంచర్ గా రూపుదిద్దుకోనుంది. 2000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది.