`దర్శి సురేష్‌బాబు అకాల మరణం వార్త విని నా గుండె బద్దలైంది. నిజంగా ఆయన చాలా మిస్సవుతున్నా. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన కుటుంబానికి మరింత ప్రేమ, బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా` అని మహేష్‌ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. 

సూపర్‌ స్టార్‌ కృష్ణ, మహేష్‌బాబుల నెల్లూరు జిల్లా ఫ్యాన్స్ అసోసియేషన్‌ అధ్యక్షుడు దర్శి సురేష్‌బాబు. ఆయన గురువారం హఠాన్మరణం చెందారు. దీంతో మహేష్‌ అభిమానులు షాక్‌కి గురయ్యారు. మహేష్‌ అభిమాన సంఘం టీమ్‌ ఒకరు మహేష్‌తో దాసరి సురేష్‌బాబు దిగిన ఫోటోని పంచుకుంటూ తీవ్ర సంతాపం తెలిపారు. మహేష్‌కి ట్యాగ్‌ చేశారు. 

ఇది చూసి మహేష్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రీట్వీట్‌ చేస్తూ ఆయన కుటుంబానికి అండగా నిలవాలన్నారు. మహేష్‌ ట్వీట్‌కి అభిమానులు, నెటిజన్లు స్పందిస్తూ, బాధితకుటుంబానికి ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందని కామెంట్‌ చేస్తున్నారు. మరి దీనిపై మహేష్‌ ఎలాంటి ఇనిషియేట్‌ తీసుకుంటారో చూడాలి.