నందమూరి హరికృష్ణ మరణంతో కుటుంబంతో పాటు అభిమానులు విషాదంలో మునిగిపోయారు. కళ్యాణ్ రామ్, తారక్ ఆసుపత్రికి చేరుకొని తమ తండ్రిని చూసుకొని కన్నీటిపర్యంతమయ్యారు.
నందమూరి హరికృష్ణ మరణంతో కుటుంబంతో పాటు అభిమానులు విషాదంలో మునిగిపోయారు. కళ్యాణ్ రామ్, తారక్ ఆసుపత్రికి చేరుకొని తమ తండ్రిని చూసుకొని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. హరికృష్ణకి నివాళులు అర్పించిన మహేష్ బాబు.. ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
''సడెన్ గా హరికృష్ణ గారు మరణించడం ఎంతో బాధకు గురి చేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. నా బలం, ప్రేమ నీకు ఎప్పటికీ ఉన్నాయి బ్రదర్ తారక్'' అంటూ ట్వీట్ చేశారు. అలానే సినీ హీరోలు నాని, సందీప్ కిషన్, దర్శకుడు అనీల్ రావిపూడి, హారిక హాసిని క్రియేషన్స్ ఇలా విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ నందమూరి కుటుంబం ధైర్యంగా ఉండాలంటూ హరికృష్ణకి నివాళులు అర్పిస్తున్నారు.
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
