తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ ఆదివారం నిర్వహించిన తెలుగు సినీ రథసారధుల రజతోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. వేడుకలో చినజీయర్ స్వామి, కృష్ణంరాజు, చిరంజీవి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు జయప్రద, సుమలత, జయసుధ, రోజా రమణి, జీవిత రాజశేఖర్ వంటి సీనియర్ నటీమణులు కూడా వేడుకకు హాజరయ్యారు. 

అయితే వేడుకలో మహేష్ బాబు మెగాస్టార్ చిరంజీవితో ప్రత్యేకంగా మాట్లాడటం అందరిని ఎట్రాక్ట్ చేసింది. ఈ స్టార్స్ కి సంబందించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వేడుకలో మహేష్ చిరంజీవి సైరా గురించి కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

మేనేజర్స్ చేస్తున్న ఈ ఈవెంట్ కు రావడం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. భవిషత్తులో వారు మరిన్ని సక్సెస్ ఫుల్ ఈవెంట్స్ చెయ్యాలని కోరుకుంటున్నాను అంటూ మెగాస్టార్ సైరా కోసం తాను కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఇక ఆయనను ఈ ఫంక్షన్ లో ప్రత్యేకంగా కలవడం కొత్త ఎనర్జిని ఇచ్చిందని సైరా యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.