‘మురారి’ని ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులు కోసం  దర్శకుడు కృష్ణవంశీ   18 నిమిషాలు ట్రిమ్ చేశారని రెడీ చేసారని తెలుస్తోంది. 

తెలుగులో గత కొంతకాలంగా వరస పెట్టి స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ కూడా ఈ రీరిలీజ్ లను ఉత్సవంలా సెలబ్రేట్ చేస్తున్నారు. దాంతో కొన్ని సినిమాలు మంచి లాభాలనే రీరిలీజ్ లో తెచ్చిపెడుతున్నాయి. ఈ క్రమంలో మహేష్ బాబు క్లాసిక్ హిట్ చిత్రం మురారిని రీరిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. 
మహేష్ బాబు పుట్టినరోజు పురస్కరించుకుని ఈ హిట్ మూవీని మరోసారి రిలీజ్ చేస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ డైరక్షన్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం మురారి.. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ . 2001లో విడుదలైన ఈ మూవీకి అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. ఇందులో మహేష్ సరసన సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించగా.. లక్ష్మీ, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు, అన్నపూర్ణ కీలకపాత్రలు పోషించారు. మెలోడీ బ్రహ్మా మణిశర్మ ఇచ్చిన అన్ని పాటలు సూపర్ హిట్టే. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉన్నాయి. ఈసినిమా మహేష్ కెరీర్‏లోనే క్లాసిక్ సినిమాగా నిలిచిపోయింది. అలాగే ‘మురారి’ని ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులు కోసం దర్శకుడు కృష్ణవంశీ 18 నిమిషాలు ట్రిమ్ చేశారని రెడీ చేసారని తెలుస్తోంది. 

మూడు నంది అవార్డుల‌ను అందుకున్న‌ది. బెస్ట్ ఫిల్మ్‌గా సిల్వ‌ర్ అవార్డుతో పాటు బెస్ట్ క్యారెక్ట‌ర్ యాక్ట‌ర్‌గా ల‌క్ష్మి నంది పుర‌స్కారాన్ని గెలుచుకున్నారు. స్పెష‌ల్ జ్యూరీ కేట‌గిరీలో మురారి మూవీకిగాను మ‌హేష్‌బాబు కూడా నంది అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇందులో మహేష్, సోనాలి కెమిస్ట్రీ సినిమాకు ప్లస్ అయ్యింది. ఆగస్ట్ 9న మహేష్ పుట్టినరోజు సందర్భంగా మరోసారి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇందుకు అఫీషియల్ అనౌన్మెంట్ కూడా వచ్చింది.

మరో ప్రక్క మ‌హేష్‌బాబు బ‌ర్త్‌డే రోజు ఈ మూవీ స్పెష‌ల్ షోస్‌ను తెలుగు రాష్ట్రాల‌తో ఓవ‌ర్‌సీస్‌లో స్క్రీనింగ్ చేయ‌బోతున్నారు. రీ రిలీజ్‌ను భారీగా ప్లాన్ చేస్తోన్న‌ట్లు తెలుస్తోంది. దాదాపు మూడు వంద‌ల‌కుపైగా థియేట‌ర్ల‌లో ఈ మూవీ రీ రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం.