మహేష్ అభిమానులు మాత్రమే కాకుండా మిగతావారు డిస్కస్ చేస్తున్నారు. అయితే అదే సమయంలో గుంటూరు కారం మాస్ సాంగ్ గురించి సర్కులేట్ అవుతున్న న్యూస్ ప్యూర్ ఫేక్ అంటూ ...


 గత కొద్ది రోజులుగా 'గుంటూరు కారం'పై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. నిర్మాత నాగవంశీ ఎంటర్ కావడంతో ఈ గొడవ మరింత పెద్దదై,డిస్కషన్ పాయింట్ గా మారిపోయింది. ఎవరితోనూ ఫైట్‌ చేయవద్దు, లేదంటే వాదించవద్దు.. కేవలం నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్లు అంటూ డాగ్ స్టోరీ మోరల్‌ ను ట్వీట్‌ చేయడం ద్వారా నాగ వంశీ తమ గుంటూరు కారం విషయంలో ఎవరితోనూ చర్చలు జరిపేది లేదు అంటూ తేల్చి చెప్పాడు. మేము ఏం చేస్తున్నాం అనేది మాకు బాగా తెలుసు. కనుక మనం అందరం కూడా జనవరి 12న థియేటర్లలో కలుద్దాం అన్నట్లుగా నాగ వంశీ ట్వీట్‌ చేయటమే హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో ఇప్పుడు మహేష్ బాబు తన దర్శకుడు త్రివిక్రమ్ కు, సంగీత దర్శకుడు తమన్ కు క్లాస్ పీకారంటూ ఓ వార్త సోషల్ మీడియా ద్వారా బయిటకు వచ్చింది. మహేష్ బాబు... గుంటూరు కారం లోని మాస్ సాంగ్ పై అసంతృప్తిగా ఉన్నారని, మళ్ళీ రీ వర్క్ చేసుకుని తిసుకురమ్మన్నారని ఆ వార్త సారాంశం. ఇది ట్విట్టర్ లోవైరల్ అవుతోంది. మహేష్ అభిమానులు మాత్రమే కాకుండా మిగతావారు డిస్కస్ చేస్తున్నారు. అయితే అదే సమయంలో గుంటూరు కారం మాస్ సాంగ్ గురించి సర్కులేట్ అవుతున్న న్యూస్ ప్యూర్ ఫేక్ అంటూ నిర్మాణ సంస్ద ట్వీట్ చేసింది. దాంతో ఏది నిజం ..ఏది అబద్దం అనే డైలమోలో ఫ్యాన్స్ పడిపోయారు.

 ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటేనే క్రేజ్ మామూలుగా ఉండదు. అలాంటిది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ అంటే నెక్ట్స్ లెవిల్ లో ఉంటుందనేది నిజం. ఈ సినిమా కు జరుగుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్ పై ట్రేడ్ లో కథ లు కథలు గా చెప్పుకుంటున్నారు. హారిక, హాసిని బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను 2024 జనవరి 13న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం టీజర్ ఓ రేంజిలో క్రేజ్ తెచ్చుకుంది. మహేష్ బాబు ఎన్నడూ లేని విధంగా అవుట్ అండ్ మాస్ అవతార్ లో కనిపించటంతో సినిమాపై అంచనాలను అమాంతం పెరిగిపోయాయి. దానికి తోడు ఈ సినిమాలో.. హాట్ బ్యూటీ శ్రీలీల(Sreeleela), ఖిలాడీ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi chaudary) హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా స్దాయిలో రిలీజ్ చేసే ఆలోచన ఏమీ లేదని నిర్మాత నాగవంశీ తేల్చి చెప్పేసారు. అలాగే గుంటూరుకారం సంక్రాంతికి రావడం ఖాయం అని తేల్చేశారు. ఒక వేళ ఇంకే సినిమా ఆ టైంలో రిలీజ్ అయితే థియేటర్స్ సమస్య వస్తుంది తప్ప తమ సినిమాకి పోటీ కాదని అన్నారు. ఏ సినిమా అయిన వాయిదా పడుతుందేమో అనే ఉద్దేశ్యంతో అందరూ ముందుగానే స్లాట్ వేసి ఉంచుకుంటున్నారని తాను అనుకుంటున్నట్లు నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. జనవరి 11 నుంచి అమెరికాలో ప్రివ్యూలు ప్రారంభమవుతాయని నిర్మాత నాగవంశీ ఇటీవలే స్పష్టం చేశారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోని సగానికి పైగా థియేటర్లను ఆక్రమించడం ఖాయమనేది నిజం.