మహేష్‌ బాబు బర్త్ డే సందడి ప్రారంభమైంది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు కొత్త సినిమా నుంచి ట్రీట్‌ ఇవ్వబోతున్నారు. ఆ టైమ్‌ ఫిక్స్ చేశారు.

మహేష్‌బాబు పుట్టిన రోజు సందడి మొదలైంది. ఈ నెల(ఆగస్ట్) 9న సూపర్‌ స్టార్‌ మహేష్‌ బర్త్ డే అనే విషయం తెలిసిందే. ఈ సందర్బంగా తన కొత్త సినిమా నుంచి అప్‌డేట్‌ ఇవ్వబోతున్నారు. తాజాగా చిత్ర బృందం ఈ విషయాన్ని వెల్లడించింది. ఆగస్ట్ 9, ఉదయం 9.09గంటలకు `సూపర్‌ స్టార్‌ బర్త్ డే బ్లాస్టర్‌` పేరుతో ట్రీట్‌ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. 

Scroll to load tweet…

ప్రస్తుతం మహేష్‌ `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. `గీత గోవిందం` ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్‌, జీఎంబీ ఎంటర్టైన్‌మెంట్స్ పతాకాలపై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తోపాటు టీజర్‌ని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

అన్నట్టు మహేష్‌ ఈ నెల 9న తన 46వ బర్త్ డే జరుపుకోబోతున్నారు.ఈ సందర్భంగా తన అభిమానులు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనాలని, మొక్కలు నాటాలని రిక్వెస్ట్ చేశారు. తన బర్త్ డే సందర్భంగా తన కోసం ఈ పనిచేయమని తెలిపారు మహేష్‌.