గ్యాంగ్ స్టర్ గా మహేష్ బాబు ? 'KGF'కు నెక్ట్స్ లెవిల్ లో ..
కేజీఎఫ్ లాంటి సినిమా కావాలంటే అందుకు తగ్గ స్పాన్ ఉన్న సబ్జెక్టుని ఎంచుకోవాల్సిందే అని సందీప్ వంగా సబ్జెక్టు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వినపడుతోంది. అయితే ఇప్పుడిప్పుడే ఆ ప్రాజెక్టు పట్టాలెక్కదు.

మహేష్ బాబు త్వరలో గ్యాంగస్టర్ పాత్రలో కనిపించనున్నారా అంటే అవుననే వినపడుతోంది. ఈ మేరకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు ఫిల్మ్ సర్కిల్సో చెప్పుకుంటున్నారు. `అర్జున్ రెడ్డి` ఫేమ్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో మహేష్ తన 30వ ప్రాజెక్ట్ ని చేయనున్నారు. ఇందులో మహేష్ నెవర్ బిఫోర్ అవతార్‌లో గ్యాంగ్ స్టర్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. `యానిమల్` సినిమాని ముందు మహేష్‌తో చేయాలని సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేసినా అలాంటి వైల్డ్ క్యారెక్టర్‌లో కనిపించడానికి మహేష్ ఆసక్తి చూపించక పోవడంతో ఆ మూవీని రణ్ బీర్ కపూర్‌తో పూర్తి చేశారు.
అలాంటి పూర్తి హింస సబ్జెక్టులు చేస్తే తన ఫ్యామిలీ ఫాలోయింగ్ కు ఇబ్బంది కలిగే అవకాసం ఉందని ఆయన భావించినట్లు వార్తలు వచ్చాయి. అయితే మారుతున్న కాలంలో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ లు చేయాల్సిన అవసరం , అవకాసం కనపడుతున్నాయి. కేజీఎఫ్ లాంటి సినిమా కావాలంటే అందుకు తగ్గ స్పాన్ ఉన్న సబ్జెక్టుని ఎంచుకోవాల్సిందే అని సందీప్ వంగా సబ్జెక్టు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వినపడుతోంది. అయితే ఇప్పుడిప్పుడే ఆ ప్రాజెక్టు పట్టాలెక్కదు. కాస్త టైమ్ పడుతుంది.
మహేష్ బాబు కోసం ఒక పవర్ఫుల్ స్టోరీ రాసుకున్నాను, సరైన టైం వచ్చినపుడు దానిని పట్టాలెక్కిస్తాం అంటూ గతంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పలు ఇంటర్వ్యూస్ లో తెలిపారు. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీలో మహేష్ బాబు గ్యాంగ్ స్టర్ రోల్ చేయనున్నారట.ప్రభాస్‌తో `స్పిరిట్`ని పూర్తి చేసిన తరువాత అలాగే రాజమౌళి ప్రాజెక్ట్ తరువాత కానీ మహేష్ మూవీని సందీప్ రెడ్డి వంగ సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉందని తెలిసింది. ఈ ప్రాజెక్ట్ ని నిర్మించేది ఎవరు?, మహేష్‌కు జోడీగా ఎవరు నటిస్తారు? వంటి పూర్తి వివరాలు త్వరలో అఫీషియల్ గా సందీప్ రెడ్డి వంగ ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది.
ప్రస్తుతం మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ `గుంటూరు కారం`(Guntur karam)చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే. శ్రీలీల హీరోయిన్‌లుగా నటిస్తుండగా జగపతిబాబు పవర్ ఫుల్ విలన్‌గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 13న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.త్రివిక్రమ్ తో కలిసి మహేష్ దాదాపు పన్నెండేళ్ల విరామం తరువాత చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.