ఇప్పుడున్న టాప్ హీరోలు ఒకరితో మరొకరు మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. అంతకాదు రెగ్యులర్ ఫ్యామిలీలతో ఒకరినొకరు కలుస్తున్నారు.

ఇప్పుడున్న టాప్ హీరోలు ఒకరితో మరొకరు మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. అంతకాదు రెగ్యులర్ ఫ్యామిలీలతో ఒకరినొకరు కలుస్తున్నారు. వారి మధ్య పొరపొచ్చాలు లేవు. వృత్తిపరమైన జెలసీలు లేవు. టాలీవుడ్ లో ఇది చాలా మంది ట్రెండ్. రామ్ చరణ్ ,ఎన్టీఆర్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఇలాగే మహేష్,ఎన్టీఆర్ ల మధ్యకూడా అంతకు మించిన అనుబంధం ఉంది. ఎన్టీఆర్ అందరితో చక్కగా కలిసిపోతారు.ఆప్యాయంగా మెలుగుతారు. అదే అందరికి ఇష్టమవుతోంది. మహేష్ కూడా ఎంత బిజిలో ఉన్నా రిలేషన్స్ ని, ఫ్రెండ్షిప్ ని మర్చిపోరు. అందుకు ఈ ఫొటోనే ఉదాహరణ.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

View post on Instagram

నిన్న రాత్రి ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి భార్య మాలిని తన పుట్టిన రోజుని ఇదిగో ఇద్దరి స్టార్స్ మధ్యన జరుపుకుంది. వంశీ పైడిపల్లి గతంలో ఎన్టీఆర్ తో బృందావనం అనే హిట్ ఇచ్చారు. మహేష్ తో ఇప్పుడు మహర్షి చిత్రం చేస్తున్నారు. ఎన్టీఆర్, మహేష్ ఇద్దరూ తమ కుటుంబాలతో వచ్చి ఈ పార్టీలో పాల్గొనటంతో ఓ పండగ వాతావరణం ఏర్పడింది. నమ్రత ఈ ఫొటోని తన ఇనిస్ట్రగ్రమ్ ఎక్కౌంట్ ద్వారా షేర్ చేసి అభిమానులకు ఆనందం కలగచేసారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తన ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ నుంచి కొద్ది రోజులు పాటు బ్రేక్ లో ఉన్నారు. మహేష్ తన తాజా చిత్రం మహర్షి రిలీజ్ దాకా రోజూ ఏదో ఒక హడావిడి ఉండనే ఉంటుంది.