సినిమా కెరీర్ పరంగానే కాకుండా ఫైనాన్షియల్ గా కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వడంతో మహేష్ తరువాతే ఎవరైనా. సినిమాలు లేని సమయంలోనే యాడ్స్ ద్వారా మంచి ఇల్లు నిర్మించుకున్నాడు. మంచి ప్లానింగ్ తో ముందుకు సాగే మహేష్ ఫైనల్ గా గుచ్చిబౌలిలో తన AMB థియేటర్ ని కూడా మొదలెట్టేసాడు. 

గత కొన్ని రోజులుగా ఈ మల్టిప్లెక్స్ లాంచ్ ఈవెంట్ వాయిదా పడుతూ వస్తోంది. దీంతో నేడు అఫీషియల్ గా మహేష్ తండ్రి కృష్ణ గారితో ఓపెనింగ్ చేయించారు. ఏషియన్ సంస్థతో మహేష్ బాబు ఈ మల్టీప్లెక్స్ ను నిర్మించారు. 7 స్క్రీన్స్ లు కలిగిన ఈ మల్టీప్లెక్స్ లో మొత్తంగా 1636 సీట్ల కెపాసిటిని కలిగి ఉంది. ముఖ్యంగా సెలబ్రెటీల కోసం స్పెషల్ షోల కోసం ఒక స్క్రీన్ ప్రత్యేకంగా నిర్మించారు. 

ఇక ఈవెంట్ కు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వేడుకకి మహేష్ కుటుంబ సభ్యులందరు వచ్చారు. పలువుఋ సినిమా ప్రముఖులు పారిశ్రామిక వేత్తలు కూడా ఈవెంట్ లో పాల్గొన్నారు. నేడు సాయంత్రం ఆరు గంటలకు 2.0 షోతో సినిమా థియేటర్ లో షోస్ మొదలవనున్నాయి.