Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు మార్చి 7వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో మినిస్టర్ రిషి కి ఫోన్ చేసి మీకు కంగ్రాట్స్ అనగా దేనికి సార్ అనగా దేనికి అంటావేంటి రిషి ఇందాకే మీడియాలో న్యూస్ చూశాను నువ్వు వసుధార ఒకటి అవ్వడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అని అంటాడు మినిస్టర్. మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని తెలిసి మొదటి ఆశ్చర్యపోయాను ఆ తర్వాత చాలా సంతోషించాను అని అంటాడు. వసుధారకీ కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెబితే మా రిషి సార్ పర్మిషన్ తీసుకుంటానని చెబుతోంది. సరే రిషి మీరిద్దరూ మా ఇంటికి భోజనానికి రండి అనగా సరే సరే అని అంటాడు. ఏంటి ఈ వసుధర మినిస్టర్ గారు ఫోన్ చేసినప్పుడు చెప్పాలి కదా, ఆయన నన్ను పర్మిషన్ అడగడం ఏంటి? అసలు కాలేజీకి వచ్చిందో రాలేదో అనుకుంటూ ఉంటాడు.
మరోవైపు మహేంద్ర చేతిలో వసుధార రిషిల ఫోటో పట్టుకొని ఇది ఎక్కడ పెట్టాలి అనగా నీ ఇష్టం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకో అనగా నీ కోపమే ఆ రిషికి వచ్చిందా ఏంటి అనగా మహేంద్ర నన్ను ఏమైనా అను నా కొడుకుని మాత్రం ఏమి అనొద్దు అని అంటుంది. అప్పుడు మహేంద్ర తింగరి తింగరిగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఆ పోస్ట్ ని అతికిస్తూ ఉండగా ఇంతలో రిషి రావడంతో అప్పుడు మహేంద్ర ఆ పోస్టర్ కనిపించకుండా అడ్డుగా నిలబడతాడు. మీరు ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు అనడంతో ఊరికే వచ్చాము అని అంటాడు మహేంద్ర. అప్పుడు రిషి మేడం వసుధార ఇంకా రాలేదు ఏంటి మీకు ఏమైనా రాలేదని ఇంఫాం చేసిందా అని అడుగుతాడు. లేదు నాకేం చెప్పలేదు అని అంటుంది జగతి.
అప్పుడు డాడీ ఏంటది అనడంతో ఏమి లేదు అని కవర్ చేస్తుండగా నేను చూస్తాను అని రిషి ఆ ఫోటో చూసి ఆశ్చర్యపోతాడు. ఇందాక స్టూడెంట్స్ ఇచ్చిన పోస్ట్ ని ఇక్కడ అతికిద్దామని వచ్చాము అని జగతి అనడంతో నీకు నచ్చకపోతే తీసేద్దాం తీసేద్దాం అనే మహేంద్ర అనడంతో ఎందుకు తీసేయాలి అని అంటాడు రిషి. అప్పుడు ఆ పోస్టర్ ని తీసేయవద్దు ఇలాగే ఉంచండి అని చెప్పి రిషి ఆ పోస్టర్ ని అతికించి దాన్ని చూసి సంతోషపడుతూ ఉంటాడు. ఆ తరువాత రిషి ఎందుకు వసుధార రాలేదు ఫోన్ చేసి అడుగుదామా అనుకుంటూ ఉంటాడు. వసుధార కాలేజీకి ఎందుకు రాలేదు అని అడగడంతో నాకైతే ఏమీ చెప్పలేదు రిషి అని అంటుంది జగతి. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మేడం అనడంతో లోపల తనపై కొండంత ప్రేమని పెట్టుకొని బయటికి మాత్రం కోపంగా మాట్లాడుతావు రిషి అనుకుంటూ ఉంటుంది జగతి.
అప్పుడు జగతి వసుధారకీ ఫోన్ చేసి ఎందుకు కాలేజీకి రాలేదు వసు ఎండి గారు పక్కనే ఉన్నారు మాట్లాడు అనడంతో ఎందుకు కాలేజీకి రాలేదు అనగా రావాలనిపించడం లేదు మేడం అని అంటుంది. అప్పుడు జగదీ ఫోన్ లో వసు రిషి ఇద్దరు ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉండగా మధ్యలో జగతి ఎటు మాట్లాడాలో తెలియక ఆలోచనలో పడుతుంది. ఈ గొడవ ఇంతట్లో ఆగేలా లేదు అనుకుంటూ ఉంటుంది. ఏంటి వసు ఇది కాలేజీకి రాకపోతే ఒకసారి ఇంఫార్మ్ చేయాలి కదా మీ ఎండి గారు ఇంత టెన్షన్ పడుతున్నారు అనడంతో రిషి సార్ కీ నా మీద ఎంత కోపమో అంతే ప్రేమ ఉంది కోపాన్ని ప్రేమ రెండింటిని భరించాలి అని అంటుంది వసుధార. ఆ తర్వాత జగతి, మహేంద్ర ఇద్దరూ రిషి, వసుధార ల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ మంచి ప్రేమికులు వారి బంధాన్ని ఎవరు విడదీయలేరు అని మహేంద్ర కు ధైర్యం చెబుతూ ఉంటుంది జగతి.
మరొకవైపు రిషి కారులో వెళ్తూ వసుధార ఏమయ్యింది ఎందుకు కాలేజీ రాలేదు అనుకుంటూ ఆలోచించుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. మరొకవైపు వసు జరిగిన విషయాలు తలుచుకొని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి చక్రపాణి వస్తాడు. ఏం ఆలోచిస్తున్నావమ్మా అనడంతో ఏమీ లేదు నాన్న అనగా జరిగినవన్నీ మన మంచికే అనుకుందామమ్మా అని అంటాడు చక్రపాణి. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు అనడంతో ఇంతలో రిషి వచ్చి కారు హారన్ కొట్టగా వసుధార సంతోషంతో కారు దగ్గరికి వెళ్తుంది. అప్పుడు వసుధార పరిగెడుతూ కింద పడిపోతుండగా ఇంతలో రిషి వచ్చి వసుధారని పట్టుకుంటాడు.
మెల్లగా రావచ్చు కదా అనడంతో మీరు వచ్చారు కదా అని అనగా నేను వస్తే గాల్లో తేలుకుంటూ రావాలా సర్లే వెళ్దాం పద మనకు బయట పని ఉంది అని అంటాడు రిషి.ఇప్పుడు వస్తావా రావా అని అడగగా వస్తాను కానీ నా అవతారం చూడండి ఎలా ఉన్నాను రెండు నిమిషాలు లోపలికి వచ్చి కూర్చోండి సార్ బయలుదేరుతాను అనడంతో రిషి వసు ఇద్దరు లోపలికి వెళ్తారు. తర్వాత దేవయాని రిషి గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది.
