మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం 'మహర్షి' . పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో, 'అల్లరి' నరేశ్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు.  ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని డబ్బింగ్ దశలో ఉన్న  ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నారు. ఈ నేపధ్యంలో ఈ సినిమా కథకు సంబంధించి రకరకాల కథలు, రూమర్స్  మీడియాలో ప్రత్యక్ష్యమవుతున్నాయి. తాజాగా మరో రూమర్ ఇప్పుడు తెలుగు మీడియాని ఊపేస్తోంది. అదేమిటంటే..

పాశర్లపూడి బ్లో అవుట్ సంఘటనని తూర్పు గోదావరి జిల్లా వాసులు మర్చిపోవటం కష్టమే.  1995 కృష్ణా గోదావరి బేసిన్ కు సంబంధించిన గ్యాస్ పైప్ లైన్  తూర్పు గోదావరి జిల్లాలోని పాశర్లపూడి గ్రామం పేలిపోయి గ్యాస్ లీక్ అయి అప్పట్లో సంచలనం అయ్యింది.  ఈ గ్యాస్ బ్లో అవుట్ సంఘటన భారతదేశంలోనే అతిపెద్ద బ్లో అవుట్ గా నమోదు అయ్యింది. 

ఈ సంఘటన జరిగినప్పుడు పాశర్లపూడి చుట్టుపక్కల ఉన్న యాభైకు పైగా గ్రామాలు పొగతోనూ.. బ్లో అవుట్ నుంచి వచ్చే బూడిదతోనూ కప్పుబడ్డాయి.  దాదాపుగా 1500 మందిని తమ ఇళ్ళనుండి ఖాళీ చేయించటం జరిగింది. అయితే సినిమాల్లో ఎందుకనో ఎవరూ ఆ బ్లో అవుట్ గురించి ప్రస్దావించలేదు.

కానీ ఇంతకాలానికి మహర్షి సినిమాలో అది జరిగిందంటున్నారు.   'మహర్షి' సినిమాలో ఈ  బ్లో అవుట్ సంఘటన కీలకమై నిలుస్తుందని.. దీంతోనే  కథ టర్న్ తీసుకుంటుందని  అంటున్నారు.  ఈ మేరకు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా పూర్తి చేసారట. 

ఈ చిత్రంలో మహేష్ మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన 5 మందిలో ఒకడిగా మ‌హేష్‌ నటిస్తున్నట్లు తెలుస్తోంది. కార్పోరేట్ అధిపతిగా యూఎస్ నుండి తిరిగివచ్చి వ్యవసాయంలో రైతులకు సరికొత్త విధానాన్ని అందించే పాత్రలో కనిపించబోతున్నారట మహేష్. 

దిల్ రాజు, అశ్వినీదత్ , పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.చిత్రంలో మ‌హేష్ స్నేహితుడిగా అల్ల‌రి న‌రేష్ న‌టిస్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ త‌ర్వాత మ‌హేష్ త‌న 26వ చిత్రంగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు.