సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సినిమా రిలిజయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకున్నప్పటి నుంచి మహేష్ ప్రమోషన్స్ డోస్ ఇంకాస్త పెంచాడు. 10 రోజుల్లోనే అదిరిపోయే బిజినెస్ చేస్తోన్న ఈ మహర్షి మహేష్ థియేటర్ లో కూడా మంచి వసూళ్లనే రాబట్టింది. 

AMB సినిమస్ మహేష్ ఆధ్వర్యంలోనే నడుస్తోందని అందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పటివరకూ సరైన బాక్స్ ఆఫీస్ సినిమా రాకపోవడంతో ఈ మల్టిప్లెక్స్ లో అనుకున్నంతగా కలెక్షన్స్ రాలేవు. అయితే రీసెంట్ గా మహర్షి AMBలో కోటికిపైగా షేర్స్ ను అందుకొని  సరికొత్త రికార్డును నమోదు చేసింది.  

సాధారణంగా ఏ సినిమాలైనా నైజం ఏరియాలో సింగిల్ థియేటర్ లో ఈ స్థాయిలో కలెక్షన్స్ ను అందుకోవాలంటే మినిమమ్  నాలుగైదు వారాలైనా సమయం పడుతుంది.  . అదికూడా పెద్ద సినిమా అయితేనే.  కానీ AMBలో 10 రోజుల్లోనే కోటికిపైగా కలెక్షన్స్ ను సాధించింది. ఇక్కడ రిలీజైనప్పటి నుంచి మహర్షి రెండెకల షోలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు టోటల్ గా 80కొట్ల షేర్స్ ను సాధించిన ఈ సినిమా హిట్ లిస్ట్ లో చేరాలంటే ఇంకా 20 కోట్ల వరకు రాబట్టాలి. మహర్షి ప్రీ రిలీజ్ బిజినెస్ 100కోట్లు.