సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'మహర్షి' సినిమా విడుదలకు సిద్ధమైంది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'మహర్షి' సినిమా విడుదలకు సిద్ధమైంది. మే 9న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మహేష్ 25వ సినిమా కావడంతో 'మహర్షి'పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 

తాజాగా సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. ఎలాంటి కట్స్ లేకుండా సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే కనిపించనుంది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్‌ రాజు, పీవీపీ, అశ్వనీదత్‌ సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ట్రైలర్ మహేష్ మూడు గెటప్స్ ని చూపించారు. దీంతో సినిమా మరింత ఆకట్టుకునేలా ఉంటుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Scroll to load tweet…