సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా మహేష్ సినిమాలకు బిజినెస్ జరుగుతుంటుంది. ఈ సినిమా విషయంలో కూడా అంతే.. రూ.100 కోట్ల వరకు ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

అంటే సినిమా షేర్ రూపంలో వంద కోట్లు రాబట్టాలి.. గ్రాస్ వసూళ్లు రూ.150 కోట్లకు చేరాలి.. అప్పుడే సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది. లేకపోతే బయ్యర్లకు నష్టాలు తప్పవు. అయితే ఇప్పుడు ఈ సినిమా అంత వసూలు చేస్తుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఓపెనింగ్స్ విషయంలో బెంగ పడాల్సిన అవసరం లేదు.

టాక్ ఎలా ఉన్నా.. మొదటి వీకెండ్ కి యాబై నుండి అరవై కోట్ల మధ్య షేర్ వస్తుంది. ఆ తరువాత సినిమా కలెక్షన్స్ రాబట్టడమే కష్టం. మహేష్ నటించిన 'భరత్ అనే నేను' సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చినా.. సినిమా బయ్యర్లకు నష్టాలను మిగిల్చింది.

రూ.90 కోట్ల దగ్గర ఆగిపోయింది. వంద కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయింది. 'మహర్షి' విషయంలో ఏం జరుగుతుందనే భయం నిర్మాతల్లో కూడా ఉందంటున్నారు. రికార్డుల సంగతి పక్కన పెడితే బ్రేక్ ఈవెన్ అయితే చాలని కోరుకుంటున్నారు.