టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ 25వ చిత్రం మహర్షితో జనాలకు సరికొత్త మెస్సేజ్ ఇవ్వడానికి గట్టిగా ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. స్నేహితుడి కోసం దేశాలు ధాటి వచ్చిన శ్రీమంతుడు ఏ విధంగా పల్లెల్లో కొత్త రంగులు పూయించాడు అనే పాయింట్ అలాగే సమాజానికి మనం ఎంతవరకు ఉపయోగపడుతున్నాం అనే మరో సోషల్ మెస్సేజ్ మహర్షి సినిమాలో ఉంటుందని టాక్ వస్తోంది. 

maharshi

నిర్మాత దిల్ రాజు కూడా అదే తరహాలో వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్క ఆడియెన్ మనసు భావోద్వేగంతో బరువెక్కుతుందని అన్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమాలో మహేష్ పచ్చని పొలాల్లో కనిపించే సీన్స్ తెరపై అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయట. 

రీసెంట్ గా చిత్ర యూనిట్ షూటింగ్ కి సంబందించిన కొన్ని ఫోటోస్ ను రిలీజ్ చేసింది. అందులో మహేష్ లుక్స్ ఎప్పుడు చూడని విధంగా ఉన్నాయి. అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇక మే9న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు కొత్త ఎనౌన్స్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.